Anil Ravipudi: అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన అనిల్ రావిపూడి పటాస్ మూవీతో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్. అనంతరం సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలు చేశారు. అవి ఓ మోస్తరు విజయాన్నిఅందుకున్నాయి. ఎఫ్ 2 మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో అది కూడా ఒకటి. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి గ్రాఫ్ అమాంతంగా పెంచేసింది. ఎఫ్ 3 యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక బాలయ్యతో అనిల్ రావిపూడి మొదటిసారి తెరకెక్కించిన భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నారు.
అలాగే ఆరు నెలల్లో మూవీ పూర్తి చేసి విడుదల చేస్తాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ టీం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టార్ కమెడియన్స్ లో ఒకరైన సప్తగిరికి అనిల్ రావిపూడి అవకాశాలు ఇవ్వడం లేదట. తాను తెరకెక్కించిన ఒక్క చిత్రంలో కూడా సప్తగిరికి అవకాశం ఇవ్వలేదట. అందుకు కారణం ఏమిటో ఆయన చెప్పారు
తాను రచయితగా పని చేసిన ఓ చిత్రంలో ఒక పాత్ర అనిల్ రావిపూడి తనకోసం రాసుకున్నాడట. ఆ పాత్ర తానే చేయాలి అనుకున్నాడట. అయితే అనుకోని కారణాలతో ఆ పాత్ర సప్తగిరి చేశాడట. సప్తగిరికి ఆ పాత్ర చాలా పేరు తెచ్చిందట. అనిల్ రావిపూడితో సప్తగిరి నీ చిత్రాల్లో నాకు ఫుల్ లెంగ్త్ రోల్ రాస్తేనే నేను చేస్తాను. చిన్నా చితకా పాత్రలు చేయను అన్నాడట. అందుకే నా సినిమాల్లో సప్తగిరికి ఛాన్స్ రాలేదని అనిల్ రావిపూడి అన్నారు. సప్తగిరి నాకు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకొచ్చాడు. అదన్నమాట మేటర్…