పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు.. పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఒక ప్రాంతీయపార్టీ నాయకుడు.. జాతీయ భావాలు, జాతీయ భావాలతో ఎలా పనిచేస్తాడన్న దానికి పవన్ కళ్యాణ్ ఉదాహరణ..10 ఏళ్లు కష్టపడి పార్టీని నిలబెట్టాడు. తన వ్యూహంతో ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ గెలిపించుకోగలిగాడు. చివరకు పార్లమెంట్ హాల్ లో దిగ్గజ నేతల ముందర వేదికపై కూర్చొని మోడీ చేత ‘పవన్ అంటే తుఫాన్’ అని పొగిడించుకోగలిగాడు. దటీజ్ పవన్ అని అనిపించుకున్నాడు.
గత రెండు నెలల నుంచి జరుగుతున్నది చూస్తే.. ఆయన మంత్రి.. ఒక ఉప ముఖ్యమంత్రి.. ఎన్నో శాఖలకు అధిపతి. ఆ శాఖలు ఎంచుకోవడంలో కూడా ఎంతో వినూత్నంగా ఉన్నాయి. ఇన్నాళ్లు పవన్ చేపట్టిన శాఖలకు గుర్తింపు లేదు. కానీ పవన్ చేపట్టాక గుర్తింపు గౌరవం వచ్చింది..
పవన్ చేపట్టిన శాఖలన్నీ ప్రాధాన్యత శాఖలుగా మారాయి. పవన్ ఏదీ చేసినా వినూత్నంగా ఉంటున్నాయి. అసలు సిసలు జాతీయవాదిగా పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పంచాయితీకి రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తారట.. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్లు ఇవే నిధులు ఇచ్చేవారట.. కానీ ఇప్పుడు పవన్ రూ.10వేల చొప్పున ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పవన్ కళ్యాణ్ అధ్వర్యంలో ఆ శాఖలకే గుర్తింపు, గౌరవం పెరిగింది.. పవన్ పాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.