Catherine Tresa : ఈ జనరేషన్ హీరోలు హీరోయిన్స్ ని పెద్దగా రిపీట్ చేయరు. ఒకటి రెండు సినిమాలే ఎక్కువ. ఒకప్పుడు ఒకే కాంబినేషన్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చేవి. హీరోయిన్స్ కెరీర్ స్పాన్ కూడా ఇప్పుడు తక్కువ. కాగా ఓ హీరోయిన్ కి అల్లు అర్జున్ ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. సదరు హీరోయిన్ ఎవరు? అల్లు అర్జున్ కి ఆమె ఎందుకంత ప్రత్యేకం? అనేది చూద్దాం..
అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్ కి చేరింది. పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా బన్నీ కి ఫాలోయింగ్ ఏర్పడింది. బ్లాక్ బస్టర్ పుష్క కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బన్నీ స్టైలిష్ స్టార్, యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు సౌత్ ఇండియాకు పరిమితమైన ఆయన క్రేజ్ నార్త్ ఇండియాకు పాకింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ సైతం అల్లు అర్జున్ తో వర్క్ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఓ హీరోయిన్ పై మనసు పారేసుకున్నారట.
ఆమె పై ఉన్న ఇష్టంతో వరుసగా తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారట. సహజంగా బన్నీ హీరోయిన్స్ ని రిపీట్ చేయరు. ఎక్కువశాతం కొత్త కాంబినేషన్స్ ట్రై చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాంటిది ఆమెపై ముచ్చటపడి మూడు సార్లు తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే .. కేథరీన్ ట్రెసా. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చమ్మక్ చల్లో మూవీతో కేథరిన్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంది కేథరీన్. ఇద్దరమ్మాయిలు తర్వాత సరైనోడు సినిమాలో మళ్లీ ఈ బ్యూటీ కి ఛాన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇందులో కూడా సెకండ్ హీరోయిన్ గా చేసింది. అంతేకాదు రుద్రమదేవి సినిమాలో కూడా గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ నటించాడు. ఆయనకు జంటగా అన్నాంబిక పాత్రలో కేథరీన్ నటించింది.
ఇలా వరుసగా మూడు సినిమాల్లో కేథరీన్ – అల్లు అర్జున్ జోడీగా నటించారు. కేథరీన్ పై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే అల్లు అర్జున్ ఆమెకు అవకాశాలు ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది. కన్నడ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన కేథరిన్ ఆ తర్వాత మలయాళం, తమిళంలో నటించింది. తెలుగులో పైసా, నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నంద, సరైనోడు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించింది.
కానీ ఆమెకు బ్రేక్ రాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఆమె చివరిగా తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి ఆగస్టు లో రిలీజ్ కావాల్సిన పుష్ప 2 షూటింగ్ ఆలస్యమవడంతో డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది.
పుష్ప 2 చిత్రంలో ప్రధాన విలన్ గా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో చిత్రం నిర్మిస్తుంది. అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.