కేరళ ఎన్నికల్లో బీజేపీ తిరువంతనంతపురం మేయర్ గెలవడంతో దాని అసలు సిసలు ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీ పర్ ఫామెన్స్ ఎలా ఉందో సమగ్రంగా చర్చిద్దాం. తిరువనంతపురం మేయర్ ఎన్నిక అంత ఆషామాషీ గెలుపు కాదు.. కాంగ్రెస్ వాల్లు ఏదో చులకనగా మాట్లాడినా.. తిరువనంతపురం మొత్తం కేరళలోనే అతిపెద్ద కార్పొరేషన్ కావడం గమనార్హం. ఇది కేరళ రాజధాని.
తిరువంతపురంలో మొత్తం 101 వార్డుల్లో 100 వార్డులకు ఎన్నిక జరిగింది. 50 వార్డుల్లో బీజేపీ గెలిచింది. రాజీవ్ చంద్రశేఖర్ తన వ్యూహం కరెక్ట్ అని రుజువైంది. అభివృద్ధి, డెవలప్ మెంట్ ప్లాన్ మీదనే ఓట్లు అడుగుతానని.. ఎలా అభివృద్ధిచేస్తానో కరపత్రాలతో ప్రజల ముందుకు వెళ్లాడు. బీజేపీపై కేరళలో వ్యతిరేకత ఉన్నా తిరువంతనపురంలో దాన్ని అధిగమించడంలో రాజీవ్ చంద్రశేఖర్ విజయం సాధించాడు.
మొట్టమొదట కేరళలో పాలన చేపట్టే అవకాశం బీజేపీకి వచ్చింది. అతిపెద్ద సిటీ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లోకి రావడంతో వారు ఎలా పాలిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తిరువనంతపురం మేయర్ పీఠంతో మొదలైన బిజెపి కేరళ పాలన.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
