https://oktelugu.com/

Pawan Kalyan vs Prakash Raj : పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వివాదమేంటి?

Pawan Kalyan vs Prakash Raj: ఒకరి మత ఆచారాన్ని ఇంకొకరు కామెంట్ చేయడం మంచిది కాదు.. ఆ మత భక్తుల మనోభావాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడడం ఏమాత్రం సహేతుకం కాదు. భక్తుల భావాలు అర్థం కానప్పుడు సైలెంట్ గా ఉండకుండా..

Written By: , Updated On : September 25, 2024 / 07:10 PM IST

Pawan Kalyan vs Prakash Raj : తిరుపతి లడ్డూ వ్యవహారం లౌకిక వాదానికి సంబంధించింది కాదు.. దీన్ని మన అందరం గుర్తుంచుకోవాలి. భక్తుల మనోభావాలు, వారి వేదనకు సంబంధించింది. హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్లు.. తిరుమల వేంకటేశ్వరుడిని దేవుడిగా ఆరాధించేవారు జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నారు.ఏ మతంలోనైనా ఆ ఆచారాలకు ఇలాంటివి జరిగితే ఆ మతాల వారి మనోభావాలు గాయపడుతాయి.

ఇన్ని కోట్లాది మంది ప్రజలు ఆరాధించే తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదంపై జరిగిన ఘోరాన్ని చూసి చలించిపోయిన భక్తుడు పవన్ కళ్యాణ్. ఆయనకు భక్తి భావం ఎక్కువ. ఆ భక్తి ఉన్నవారు జరిగింది తట్టుకోలేక ‘ప్రాయశ్చిత దీక్ష’ చేస్తున్నాడు. నిన్నటికి నిన్న దుర్గ గుడి మెట్లు కడిగాడు.

అటువంటి వ్యక్తి కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ పెడితే.. ప్రకాష్ రాజ్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏంటి? దీన్ని ‘దేశవ్యాప్తంగా సమస్యగా ఎందుకు మారుస్తున్నారు.. మీరే డిప్యూటీ సీఎం కదా చర్యలు తీసుకోండి.. విచారించండి’ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ గా ట్వీట్ చేశారు.

ఒకరి మత ఆచారాన్ని ఇంకొకరు కామెంట్ చేయడం మంచిది కాదు.. ఆ మత భక్తుల మనోభావాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడడం ఏమాత్రం సహేతుకం కాదు. భక్తుల భావాలు అర్థం కానప్పుడు సైలెంట్ గా ఉండకుండా.. ఈ పద్ధతుల్లో పవన్ పై కౌంటర్లు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇది లైమ్ లైట్ లో ఉండాలని ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వివాదమేంటి? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వివాదమేంటి? | What is Pawan Kalyan and Prakash Raj's dispute? | Ram Talk