Asaduddin Owaisi : తిరుపతి లడ్డూ వివాదం.. జాతీయ వివాదంగా మారింది. ముఖ్యంగా 100 కోట్లకు పైనున్న హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ఇది సుప్రీంకోర్టు దాకా చేరింది. ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. ఈ వివాదంతో అసలు దేవాలయాలపై ప్రభుత్వాల అజమాయిషీ ఎందుకన్న మాట ప్రతీ ఒక్కరి నుంచి వినిపిస్తోంది.
మసీదులు, చర్చీల మీద లేనటువంటి అజమాయిషీ కేవలం దేవాలయాల మీద ప్రభుత్వాలకు ఎందుకు ఉండాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రసాదాల విషయంలో తిరుమల లడ్డూ వివాదంతో ప్రతీ ఒక్క దేవాలయ నిర్వహకులు ఉలిక్కిపడ్డారు. ప్రతీ ఒక్కరు ఇప్పుడు ప్రసాదంపై దర్యాప్తులు మొదలుపెట్టారు. కల్తీ నెయ్యి వాడుతున్నారా? ఏమేం కలుపుతున్నారన్న దానిపై నిఘా పెట్టారు.
ఈ వివాదంపై ఎంఐఎం అసదుద్దీన్ పైత్యంతో మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డూ తో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టే.. వక్ఫ్ సవరణలు తీసుకొచ్చి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారట.. అసలు ఈ రెండింటికి పోలిక ఏంటో అర్థం కాని పరిస్థితి.
తిరుపతి లడ్డు వివాదాన్ని వక్ఫ్ సవరణలతో పోల్చిన ఒవైసీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోతో పోల్చవచ్చు.