Vijay vs Stalin: తిరుపరంకుండ్రం.. ఇది ఇప్పట్లో రగిల్చిన వేడిచల్లారేలా కనిపించడం లేదు. ఇంకా ఇంకా దేశం మొత్తం పాకుతోంది. దేశంలో రామచంద్రుడు ఏ విధంగా ఆరాధ్య దేవుడో.. తమిళనాడులో మురుగన్ అంతటి ఆరాధ్య దేవుడు. మురుగన్ అంటే తమిళనాట హిందూయిజం ముడిపడి ఉంది. డీఎంకేకు ఈ విషయం తెలసు కాబట్టే ‘మురుగన్ గ్లోబల్ సమ్మిట్’ పేరిట ఓట్ల కోసం సమ్మిట్ నిర్వహించింది. ఓటు బ్యాంక్ కోసం ఇలా చేసింది.
అయితే అది నిజమైనటువంటి భక్తితో చేసింది కాదు.. కేవలం రాజకీయ స్వార్థం కోసం చేసిందనేది ఇప్పుడు నిరూపించబడింది. తిరుపరంకుండ్రంలో వచ్చిన అగ్ని పరీక్షలో డీఎంకే యొక్క విధేయత ఏంటో తేలిపోయింది.
తిరుపరంకుండ్రం ఎపిసోడ్ తో డీఎంకే కొట్టుకుపోయింది.. కరుణానిధి కూడా చాలా వేరేగా హ్యాండిల్ చేసి ఉండేవాడు. ఒకవేళ డిసెంబర్ 1 తీర్పు ను ఇదే కరుణానిధి సీఎంగా ఉంటే తూతూ మంత్రంగా అమలుచేసి చూపించారు. ఆ అంశంపై ఓటర్ల దృష్టికి రాకుండా చూసుకునేవాడు.
కానీ సీఎం స్టాలిన్ ఈ తీర్పును అమలు చేయకపోగా.. డివిజన్ బెంచ్ కు వెళ్లాడు. ఇదే ఇప్పుడు తమిళనాట హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిని డీఎంకే స్టాలిన్ కు పెద్ద దెబ్బగా మారింది.
తమిళనాట హిందూ చైతన్యాన్ని రగిలించిన డీఎంకే తప్పుడు నిర్ణయం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.