Epstein files sensation: అగ్రరాజ్యం అమెరికాలో హైప్రొఫైల్ లైంగిక కుంభకోణాలు సాధారణమయ్యాయి. దేశ అధ్యక్షులుగా పనిచేసివారు. ప్రపంచ కుభేరులు ఇందులో ఉన్నరు. బిల్‌క్లింటర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. చివరకు క్లింటర్ తప్పు ఒప్పుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పైనా లైంగిక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అమెరికాలో హైప్రొఫైల్ లైంగిక కుంభకోణానికి సంబంధించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తాజా ఫొటోలు విడుదల చేసింది. డెమోక్రట్ నేతృత్వంలోని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ 19 చిత్రాలను విడుదల చేసింది. వీటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్టీవ్ బానన్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ, లారీ సమర్స్ వంటి ప్రముఖులు ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా కనిపిస్తున్నారు.
ట్రంప్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు..
ట్రంప్‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ముఖాలు బ్లర్ చేసిన అమ్మాయిలతో కలిసి కనిపిస్తున్నారు. ఒక చిత్రంలో ఎప్‌స్టీన్‌తో కలిసి ఒక యువతితో సంభాషిస్తున్న దృశ్యం, మరొకటిలో కండోమ్‌తో సంబంధం గమనార్హం. రిపబ్లికన్లు ఇవి సాధారణ ఈవెంట్ ఫొటోలు మాత్రమేనని వాదిస్తున్నారు.
ఎప్‌స్టీన్ నేపథ్యం..
ఫైనాన్షియల్ మాయాజాలం నడిపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2004లో లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమంలో 2019లో జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. అతని ప్రైవేట్ ఐలాండ్‌లైటిల్ సెయింట్ జేమ్స్, గ్రేట్ సెయింట్ జేమ్స్‌లో మైనర్ బాలికలపై దాడులు, ప్రముఖులకు ’సప్లై’ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. సహచారి గిస్లేన్ మాక్సె్వల్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది.
ఫైల్స్ విడుదల డిమాండ్..
ఎఫ్‌బీఐ, న్యాయవిభాగం ఫైల్స్‌లో క్లయింట్ లిస్ట్ లేదని పేర్కొన్నా, ప్రజల ఒత్తిడికి లొంగి ట్రంప్ నవంబర్ 30న విడుదల ఆదేశాలు సంతకం చేశారు. 20 వేల పేజీల డాక్యుమెంట్లు, 150 ఫొటోలు ఇప్పటికే బయటపడ్డాయి. ఈ–మెయిల్స్‌లో రాజకీయ, హాలీవుడ్, విదేశీ నాయకులతో సంప్రదింపులు బయటపడ్డాయి. డిసెంబర్ 19 నాటికి పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి.
ట్రంప్–ఎప్‌స్టీన్ సన్నిహిత బంధం 2004 అరెస్ట్ తర్వాత బ్రేక్ అయిందని ఆయన చెబుతున్నారు. ఫొటోలు ’పెద్ద విషయం కాదు’నని తేలికగా కొట్టిపారేశారు. డెమోక్రట్ కమిటీ రిలీజ్ రిపబ్లికన్లపై దాడిగా చూపిస్తున్నారు. ఈ ఫైల్స్ పూర్తిగా బయటపడితే అమెరికా రాజకీయ, వ్యాపార రంగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.