https://oktelugu.com/

Annamalai : అన్నామలైకి స్వాగతం పలకడానికి లండన్ లో అభిమానుల ఎదురుచూపు

అన్నామలైకి స్వాగతం పలకడానికి లండన్ లో అభిమానుల ఎదురుచూపులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2024 / 11:47 AM IST

    Annamalai : అన్నామలై ఈరోజు తెల్లవారుజామున బుధవారం ఉదయం 2.30 గంటలకు లండన్ కు బయలు దేరి వెళ్లాడు. వేలాది మంది సొంత కుటుంబ సభ్యుడు దూరమవుతున్నాడని భావోద్వేగంతో ఆయనకు ఎయిర్ పోర్టులో వీడ్కోలు చెప్పారు.

    అదీ ఒక నాయకుడిపై క్యాడర్ కు ఉండే విశ్వాసం ఇదీ.. అన్నామలై ఒక రోల్ మోడల్. డీఎంకే స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలకు కౌంటర్ గా అన్నామలై చెప్పే ప్రసంగాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి..

    ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యి.. కర్ణాటకలో నిజాయితీ అధికారిగా పేరు సంపాదించుకొని చివరకు రాజీనామా చేసి ఏటికి ఎదురీదాడు. తమిళనాడు బీజేపీ లో చేరితే వారికి భవిష్యత్ ఉంటుందని ఎవరూ అనుకోలేరు. ద్రవిడ్ వాదం పేరుతో పెరియార్ ఆలోచనలతో క్రియేట్ అయిన తమిళనాడు ప్రజల్లో బీజేపీకి ఏమాత్రం ఆదరణ లేదు. బీజేపీ ఉత్తరాది పార్టీ అని క్రియేట్ చేసి దూరం పెట్టారు.

    అన్నామలై రాకముందు బీజేపీకి తమిళనాడులో ఏం లేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 2.62 శాతం ఓట్లు.. నాలుగు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అదీ చాలా కష్టంతో అన్నాడీఎంకే పొత్తుతో ఈ సీట్లు వచ్చాయి.

    అన్నామలైకి స్వాగతం పలకడానికి లండన్ లో అభిమానుల ఎదురుచూపులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    అన్నామలైకి స్వాగతం పలకడానికి లండన్ లో అభిమానుల ఎదురుచూపు || TN BJP chief Annamalai heads to London