Gandhi Family : గాంధీ కుటుంబంతో సోరోస్ బంధంపై చర్చకు పార్లమెంట్ లో బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే కొన్ని పోస్టులు పెట్టారు. FDLAP అనే సంస్థకు నలుగురు సహా అధ్యక్షులు ఉన్నారు. అందులో 2వ వ్యక్తి సోనియాగాంధీ. రాజీవ్ గాంధీ చైర్ పర్సన్ గా సోనియా ఈ సంస్థకు సహాధ్యక్షులుగా ఉంది.
అయితే ఈ సంస్థకు సోరోస్ ఫౌండేషన్ ద్వారా నిధులు వస్తాయి. జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఒక అరాచకవాది. ఇతను 94 సంవత్సరాల యూదు జాతీయుడు. ఈయన హంగేరీలో ఉండేవాడు. నాజీ దురాక్రమణతో ఇంగ్లండ్ కు పారిపోయివచ్చాడు. వ్యాపారంలో బాగా రాణించి సంపాదించాడు. 1970లో సోరోస్ ఫౌండేషన్ స్థాపించాడు. 120 దేశాల్లో ఈ సంస్థను విస్తరించి మీడియా, రాజకీయ పార్టీలతో సోరోస్ సంబంధాలు పెట్టుకొని ‘ఓపెన్ సొసైటీ’ అంటూ ప్రారంభించాడు.
ఫిబ్రవరి 2023లో ఓ సదస్సులో సోరేస్ మాట్లాడుతూ .. ‘మోడీని దించడమే తన ధ్యేయమని.. మోడీ ప్రజాస్వామ్యవాది కాదు. ఎన్నుకున్న ప్రజాస్వామ్యాన్ని కూల్చడానికి 1 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతాడని ’ ప్రకటించి సంచలనం రేపాడు. మోడీని దించడానికి అవసరమైన అన్ని పార్టీలకు నిధులు ఇస్తానని ప్రకటించాడు.
తవ్వే కొద్ది మరింత లోతుగా గాంధీ కుటుంబం సోరోస్ బంధంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.