Manipur Riots : మణిపూర్ అల్లర్ల వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇది తెగల మధ్య గొడవ కాదని ప్రభుత్వం అనుమానిస్తోంది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింస చెలరేగింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించి భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగించారు. ఈ హింసను అదుపుచేయడానికి పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. అవసరమైతే ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నవారిని సొంత రాష్ట్రాలకు తీసుకురావడానికి రాష్ట్రలు పోటీ పడుతున్నాయి.
మణిపూర్ అల్లర్ల వెనుక ఎవరున్నారు? ఈ అతిపెద్ద కుట్ర వెనుక కారణాలు.. భారత సైన్యం త్వరలో అతిపెద్ద ఆపరేషన్ చేయబోతున్నట్టు తెలిసింది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.