Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ వయస్సు లో కూడా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ కూడా ఆయన స్టార్ హీరోలెవ్వరికీ సాధ్యం కానీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెడుతూ తనకి తాను మాత్రమే పోటీ అని మరోసారి నిరూపించుకున్నాడు, టాలీవుడ్ ఈయనకి ఉన్నన్ని వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఏ స్టార్ హీరోకి కూడా లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆయన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తాన్ని కొల్లగొట్టి ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.ఆగష్టు 11 వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నాలుగు సినిమాలను ఓకే చేసాడు. అందులో ఒక సినిమా కళ్యాణ్ కృష్ణ తో కాగా, మరో సినిమా భింబిసారా చిత్ర దర్శకుడు వసిష్ఠ తో మరో సినిమా. మిగిలిన రెండు సినిమాల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వసిష్ఠ తో చెయ్యబొయ్యే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటపడింది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎలాగా 8 మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడట.
ఇందులో స్టార్ హీరోయిన్స్ కూడా ఉంటారు, అలాగే కొత్త హీరోయిన్స్ కూడా ఉంటారట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక హీరో 8 మంది హీరోయిన్స్ తో కలిసి నటించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు, మొట్టమొదటి సారి అది మెగాస్టార్ చిరంజీవి విషయం లోనే జరగబోతుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.