SA Basha : డిసెంబర్ 16న కోయంబత్తూరులో ఒక చనిపోయిన ఉగ్రవాదిని అమరవీరుడిగా ఊరేగించడం చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. 5 కి.మీల పొడువున.. 1000కి పైగా పోలీసుల భద్రతతో డీఎంకే ఎమ్మెల్యే సమక్షంలో చనిపోయిన ఉగ్రవాదికి ఘనంగా అంత్యక్రియలు చేయడం చాలా వివాదాస్పదమైంది.
కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో ప్రథమ నేరస్థుడు ఈ ఉగ్రవాది. శిక్ష అనుభవిస్తున్నాడు. 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు ఈ ఉగ్రవాది. కశ్మీర్ లో ఇలాగే ఉగ్రవాదులకు ఘనంగా అంత్యక్రియలు చేసేవారు. శవయాత్రలు అక్కడ ఇలానే చేసేవారు. ఇప్పుడు కశ్మీర్ లో ఇలాంటి ఘటనలు తగ్గి.. దక్షిణాదిన తమిళనాడులోని కోయంబత్తూరులో 58మంది చావుకు కారణమైన ఉగ్రవాది చనిపోతే పోలీస్ బందోబస్తుతో శవయాత్ర చేయడం దారుణమనే చెప్పాలి.
ఎన్టీకే సీమెన్ అయితే ఈయన ఒక ఫాదర్ ఫిగర్ అంటూ కీర్తించారు. తిరుమలవన్ అయితే ఆయన ఫ్రీడం ఫైటర్ అంటూ కొనియాడారు. తమిళ రాజకీయ పార్టీల నేతలు సైతం ఉగ్రవాదిని కీర్తించడం చూస్తే ఎంత దారుణంగా రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
కోయంబత్తూరులో 58 మందిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదికి ఇంత మర్యాదలా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు