Uttar Pradesh : ఉత్తరప్రదేశ్.. మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఉంది. కింది స్థానాల్లో ఒకప్పుడు ఉండేది. బీమారు రాష్ట్రంగా పేరుగాంచింది. ఇవ్వాళ అప్రతిహతంగా దూసుకుపోతోంది. పోయిన సంవత్సరం 25 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ.. ఈ సంవత్సరం టార్గెట్ 32 లక్షల కోట్లకు మారింది. దీంతో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా చెప్పకతప్పదు.
ఒకటిన్నర కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా పెట్టుబడుల సమీకరణ.. ఉద్యోగ కల్పన చేయాలని ముందుకెళుతున్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్లకు పెట్టుబడులకు ఆమోదం పొందారు.
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా భారత్ లో యూపీ మారుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చాలా వెనుకబడిన యూపీ.. పాలకుల చర్యలతో బీమారు రాష్ట్రంగా మారింది.
యూపీలో విద్యుత్ వ్యవస్థ దారుణంగా ఉండేది. బిల్లులు కట్టేవారు కాదు. బిల్లులు జనరేట్ చేసేవారు కాదు.. యూపీలో యోగి వచ్చాక సంస్కరణలతో చాలా ముందుకు తీసుకొచ్చారు. సంభాల్ అనే ఎంపీ ఇంటికే విద్యుత్ మీటర్లు లేకపోవడం దారుణంగా ఉంది. యూపీలోని తూర్పు ప్రాంతమైన సంభాల్ లో అసలు విద్యుత్ మీటర్లే లేవు. డైరెక్ట్ కరెంట్ తీసుకుంటూ బిల్లులు ఎగ్గొడుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా యూపీ బిల్లుల నష్టం 1లక్షా పదివేల కోట్లుగా ఉంది.
లక్ష కోట్లకు పైగా నష్టాల్లో యూపీ విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.