Pushpa 2 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో మెయిలు రాయిని దాటుకుంటూ, ఎవ్వరూ అందుకోలేనంత రేంజ్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా, ఫాస్టెస్ట్ 1500 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుందంటే, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. రెండు దశాబ్దాలకు ఒకసారి ఇలాంటి అద్భుతాలను మనం బాక్స్ ఆఫీస్ వద్ద చూస్తూ ఉంటాము. అయితే విడుదలకు ముందు ‘పుష్ప 2 ‘ మీద అనేక అంశాలలో నెగటివిటీ ఉండేది. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైం గురించి అభిమానులు చాలా భయపడ్డారు.
మూడు గంటల సినిమా అంటేనే చాలా ఎక్కువ, అలాంటిది 3 గంటల 20 నిమిషాలంటే ఎవరు థియేటర్ కి వెళ్లి చూస్తారు?, పైగా ఎక్కువ నిడివి ఉండడం వల్ల షోస్ కూడా ఎక్కువ పడవు, దర్శక నిర్మాతలు చాలా రిస్క్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో అనేక విమర్శలు వినిపించాయి. కానీ విడుదల తర్వాత నిడివి చాలా ఎక్కువ ఉంది, సినిమా బోర్ కొట్టింది అనే విమర్శ ఎక్కడా వినిపించలేదు. ఇంకో 20 నిముషాలు ఎక్కువైనా పర్వాలేదు, సినిమా చూసేలాగానే ఉంది అనే టాక్ సోషల్ మీడియా లో వచ్చింది. ఇది టీం వరకు చేరిందో ఏమో తెలియదు కానీ, ఈ క్రిస్మస్ నుండి మరో 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో జత చేసి లేటెస్ట్ వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. మొత్తం మీద సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు అవుతుంది అన్నమాట లేటెస్ట్ వెర్షన్.
ఈ సినిమా హిందీ లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. హిందీ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి వంద కోట్ల రూపాయిల లాభాలను అందుకున్నారు బయ్యర్స్. కానీ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సంపాదించాలి. ఈ క్రిస్మస్ తో తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. ఇక వెర్షన్స్ లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కోసం ఈ సరికొత్త వెర్షన్ 25 నుండి థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. పుష్ప 2 చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ తాము నిర్మించిన నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని కూడా వాయిదా వేయించారు. మరి మేకర్స్ వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. 25 న విడుదల చేయబోతున్న లేటెస్ట్ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల చేస్తారట మేకర్స్.