Illegal immigrant protests : అమెరికాలో అక్రమ వలసదారులు ఎంతమంది? నిజం చెప్పాలంటే కరెక్ట్ లెక్కలు ఎవరికీ తెలియదు. సుమారు 15 శాతం మంది ఉంటారని అంటారు. కాలిఫోర్నియాలో 25 శాతం వరకూ ఉంటారట.. అదే దిగువన లాస్ ఏంజెల్స్ లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. అక్కడ పరిస్థితులు మరీ దిగజారాయి. అక్రమ వలసదారులు ఎక్కువ అక్కడున్నారు కాబట్టి అక్కడే ఎక్కువ జరుగుతున్నాయి.
భారత్ లో ఓటు వేయాలంటే ఐడీ కార్డ్ చూపించాలి. అమెరికాలో ఇది అవసరం లేదు. రాష్ట్రాలే అమెరికాలో డిసైడ్ చేస్తాయి. క్యాలిఫోర్నియాలో గవర్నర్ ‘ఓటు ఐడికార్డ్’ అవసరం లేదని.. అడిగితే లోపల వేస్తాం అని స్పష్టం చేశారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు తాజాగా అక్రమ వలసదారులను నిర్బంధంలోకి తీసుకొని వారిని గుర్తించి బయటకు పంపిస్తున్నారు. కాలిఫోర్నియా సహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికాలో మెక్సికో జెండా పట్టుకొని అమెరికాలో నిరసన తెలుపుతున్నారు. దానికి మానవ హక్కుల సంఘాలు, డెమొక్రటిక్ పార్టీ మద్దతు ఇచ్చాయి. కార్లు తగుల బెడుతున్నారు. ఇది ఇతర దేశాల్లో జరిగితే అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుంది? భారత్ లో జరిగితే పాశ్చాత్య దేశాలు దుమ్మెత్తిపోశాయి. కానీ అమెరికాలో జరిగితే ఈ పాశ్చాత్య మీడియా పెద్దగా పట్టించుకోరు.
అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.