PM Modi : ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తి ప్రపంచం అందరికీ తెలిసింది. అప్పటివరకూ భారత సైన్యంపై ఉన్న అంచనాలు వేరు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తి పవర్ తెలిసింది. భారత సైన్యంపై అంచనాల్లో యుద్ధ నిపుణులు, ప్రపంచ దేశాల్లో పూర్తిగా మారిపోయాయి. ఇది మూడు రోజుల యుద్ధంతో జరగలేదు.
ఇది జరగడానికి రక్షణ రంగం పటిష్టానికి తీసుకున్న ఎన్నో చర్యలు దోహదపడ్డాయి. మోడీ రాజకీయ నాయకత్వం అద్భుతంగా ఉపయోగపడింది. బాలాకోట్ నాటికి భారత సైన్యం ఇంత పటిష్టంగా లేదు. 2018లో డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ వేశారు. 2019కి వచ్చేటప్పటికీ కొత్త డిపార్ట్ మెంట్ శాఖను ఏర్పాటు చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ (సీడీఎస్) ను అపాయింట్ చేశాడు. ఇదో పెద్ద ముందడుగు వేశాడు. 2023 ఇంటర్ సర్వీసెస్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు.
17 సర్వీస్ కమాండ్ సెంటర్లను కలిపి 3 ఇంటిగ్రేటెడ్ సర్వీస్ గా మార్చి ఐక్యం చేశారు. ఈ ఆలోచనలు, సంస్కరణలు మార్పులు.. ఆత్మనిర్భర భారత్ దిశగా రక్షణ రంగాన్ని ఆధునీకరించారు. రక్షణ ఉత్పత్తి సంస్థలను కార్పొరేటర్లతో మిళితం చేశారు. ప్రైవేటు పరం చేశారు.
రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఏలను 100 శాతం అమలు చేశారు. ప్రైవేటు రంగం పాత్ర లేని రక్షణలో పెద్దపీట వేశారు. ఈ ఐటెంలు అన్ని కూడా దేశంలోనే కావాలి. రక్షణ రంగంలో 80 శాతం వస్తువులన్నీ దేశంలోనే కొంటున్నాం.
మోడీ హయాంలో రక్షణ రంగ సంస్కరణలు ఆధునీకీకరణ సైనిక శక్తికి పదును పెట్టాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.