Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda : పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ, ఇంటర్నెట్ ని...

Vijay Deverakonda : పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో!

Vijay Deverakonda : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన కింగ్ డమ్ చిత్రంలో నటిస్తున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కింగ్ డమ్ మూవీ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా షార్ట్ హెయిర్ కట్ లో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంది. జులై 4న కింగ్ డమ్ విడుదల కానుంది. విజయ్ కి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. నటుడు సత్యదేవ్ ఓ కీలక రోల్ చేస్తున్నాడు. కింగ్ డమ్ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. ఈసారి విజయ్ కి బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు.

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చాలా కాలం తర్వాత డిన్నర్ కి బయటకు వెళదాం అని విజయ్ దేవరకొండ తల్లి గారు అడిగారట. అందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. వీకెండ్ పేరెంట్స్ తో పాటు డిన్నర్ కి వెళ్లిన ఫోటోలు విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. అలాగే వీకెండ్ డిన్నర్ కి వెళదామని వాళ్ళ మదర్ చేసిన వాట్స్ ఆప్ చాట్ స్క్రీన్ షాట్ పంచుకున్నాడు.

Also Read : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?

చాలా రోజుల అనంతరం పేరెంట్స్ తో డిన్నర్ కి వెళ్లడం బాగుంది. తల్లిదండ్రులకు సమయం కేటాయించాలని కూడా కామెంట్ చేశాడు. ఆ ఫొటోలతో పాటు విజయ్ దేవరకొండ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆయన పవన్ కళ్యాణ్ పాట పాడాడు. అజ్ఞాతవాసి చిత్రంలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని విజయ్ దేవరకొండ ఆలపించాడు. ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. వారు విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇది ప్రమోషనల్ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకర్షించి, తన కింగ్ డమ్ సినిమాకు ప్రయోజనం చేకూరేలా చేయాలని ఇలా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కారణం ఏదైనా కానీ… విజయ్ దేవరకొండ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విజయ్ దేవరకొండకు భారీ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. నెగిటివ్ రివ్యూలు ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే విజయ్ దేవరకొండకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. బడా బ్యానర్స్ ఆయనతో సినిమాలు చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular