Kerala : ఆశవర్కర్లు.. వీళ్ల గురించి అప్పుడప్పుడూ వార్తలు వింటుంటాం. వీళ్లు హెల్త్ కేర్ వర్కర్లలో భాగం. గ్రామాల్లో వీరి పాత్ర కీలకం. హెల్త్ కేర్ వర్కర్స్ మూడు రకాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఉండేవారు ప్రభుత్వ వర్గాలు. రెండోది అంగన్ వాడీ వర్కర్స్ వీళ్లు అంగన్ వాడీ సెంటర్లలో ఉంటారు. అంగన్ వాడీ కేంద్రాలు 6 ఏళ్ల వరకు పిల్లలకు చదువులు, పోషణ అందిస్తారు. మూడో కేటగిరీ ఆశావర్కర్స్. వీళ్లు గ్రామాల్లోనే జనం మధ్యలో ఉంటారు.
చాలా వినూత్నమైన జాబ్ ఇదీ. ఆశావర్కర్స్ టీకాల దగ్గర నుంచి టీబీ, క్యాన్సర్ వరకూ ఆరోగ్య పరిరక్షణ వరకూ అన్ని పనులు చేస్తారు. తల్లులు, వృద్ధులు, పిల్లలు, యోగా తరగతుల వరకూ వీళ్లు చేయని పనంటూ లేదు. కరోనా సమయంలో వీళ్లు చేసిన సేవలు ఎవ్వరూ మరువలేనివి. కరోనా వారియర్స్ గా వీళ్లను పిలిచారు.ఉదయం నుంచి రాత్రి వరకూ చేస్తూనే ఉంటారు.
ప్రతీ 1000 జనాభాకు ఒక ఆశావర్కర్లు ఉంటారు. వీళ్లు రికార్డ్స్ మెయింటేన్ చేయాలి. ఇవన్నీ చేయడంతోపాటు వీరికి సరైన వేతనం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వీరి జీతాలు గౌరవవేతనం కింద కేంద్రప్రభుత్వం 2000 ఇస్తుంది. రాష్ట్రాలు ఒక్కోరకంగా వీరికి వేతనాలు ఇస్తాయి. అన్ని చోట్ల కన్నా ఎక్కువ పే చేస్తోంది ఆంధ్రప్రదేశ్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఆశావర్కర్లకు రూ.10వేలు ఇస్తున్నారు. దాంతోపాటు గ్రాట్యూటీ బెనిఫిట్ ఇస్తారు. ఆరునెలల ప్రసూతి సెలవు ఇస్తున్నారు. ఏపీ ఇప్పుడు రోల్ మోడల్ గా మారింది.
కేరళలో ఆశా వర్కర్ల ఆందోళనని వ్యతిరేకిస్తున్న సీపీఎం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.