https://oktelugu.com/

Annamalai : ఎంతమంది కలిసినా సింగం అన్నామలై ని ఎందుకు ఓడించలేరు?

ఎంతమంది కలిసినా సింగం అన్నామలై ని ఎందుకు ఓడించలేరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2024 / 01:02 PM IST

    Annamalai : దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఆసక్తికర ఎన్నిక ఏదైనా ఉందంటే.. అది ‘కోయంబత్తూర్ పార్లమెంట్ ఎన్నికనే’.. ఎందుకంటే ఇక్కడ పోటీచేస్తున్నది అన్నామలై కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీలు పోటీచేస్తున్నాయి? ఏ అభ్యర్థులు పోటీచేస్తున్నారో సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం..

    బీజేపీ తరుఫున మొన్నటి దాకా పోటీచేస్తున్నదెవరన్న సందిగ్దం తొలిగిపోయింది. అన్నామలై పోటీచేస్తున్నాడా? లేదా? అన్న డౌట్ తేలిపోయింది. కోయంబత్తూర్ లో బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక అన్నామలైపై అన్నాడీఎంకే తరుఫున జి.రామచంద్రన్ బరిలోకి దిగారు.

    డీఎంకే గణపతి రాజ్ కుమార్ పోటీచేస్తున్నారు. ఈయన ఎక్స్ మేయర్ గా ఉన్నారు. ఎన్టీకే తరుఫున కళామన్ పోటీకి దిగారు. కోయంబత్తూర్ లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోయిన సారి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 5 అన్నా డీఎంకే గెలవగా.. ఒక చోట బీజేపీ గెలిచింది. కోయంబత్తూర్ సౌత్ బీజేపీ గెలిచింది.

    గత పార్లమెంట్ 2019 ఎన్నికల్లో సీపీఎం ఇక్కడ ఎంపీగా గెలిచింది. రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. ఇక్కడ నాలుగు పార్టీలు పోటీలో నిలవగా.. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ అన్నాడీఎంకే మధ్యనే ఉండనుంది..

    ఎంతమంది కలిసినా సింగం అన్నామలై ని ఎందుకు ఓడించలేరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.