Allu Arjun gift to Vijay Deverakonda and Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ డిమాండ్ అయితే పెరిగింది…అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం పాన్ ఇండియన్ షేక్ చేస్తు కొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాడు. ఇక యాంగ్ హీరోలు సైతం పలు వైవిద్య భరితమైన పాత్రలను పోషించడానికి సిద్ధమవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన రష్మిక మందానని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు… నిన్న టిటిడి దేవస్థానాన్ని దర్శించుకున్న ఈ జంట అల్లు శిరీష్ హల్దీ ఈవెంట్ కి హాజరయ్యారు. అక్కడ అల్లు అరవింద్, అల్లు అర్జున్ లతో కలిసి చాలాసేపు మాట్లాడారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ జంటకి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
అది వాళ్ళ రిసెప్షన్ రోజున ఇస్తారట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక ఖరీదైన కార్ ను వాళ్ళిద్దరికి గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రష్మిక మందాన అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అందువల్ల ఆమె అతనికి చాలా మంచి ఫ్రెండ్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ సైతం ‘గీతా గోవిందం’ సినిమా నుంచి అల్లు అర్జున్ కి ఒక తమ్ముడిగా మారిపోయాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం తనకు చాలా హ్యాపీగా ఉందని వాళ్ళకి ఒక కారు ను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకీ అది ఏ కార్ ఏంటి అనే విషయాలను బయటికి చెప్పడం లేదు. కానీ రిసెప్షన్ రోజు దానిని వాళ్లకు ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో రాజకీయ సినీ ప్రముఖుల మధ్యలో రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్ గా జరగబోతుంది…అల్లు అర్జున్ తన తమ్ముడు అయిన శిరీష్ పెళ్లి ఉన్నప్పటికి విజయ్ రష్మిక ల రెస్పెషన్ కి అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు…