Ram Charan Birthday: రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడు. అసలు రామ్ చరణ్ ది హీరో ఫేస్ కాదని.. హీరో గా పనికి రాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం చిరంజీవి తనయుడు కాబట్టి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగలిగాడు కానీ లేదంటే ఇంపాజిబుల్ అంటూ మాట్లాడారు కొందరు. అలాంటి విమర్శల నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు అనడానికి ఆయన పడిన కష్టమే నిదర్శనం అంటారు మెగా ఫ్యాన్స్.
ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు. దీంతో టాలీవుడ్ లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జోరు మీద సాగుతున్నాయి. ఓ పక్క ఫ్యాన్స్, మరో పక్క సినిమాల అప్డేట్స్, మెగా ఫ్యామిలీ స్పెషల్ ఈవెంట్స్ అంటూ అబ్బో చెర్రీ బర్త్ డేనా మజాకా అన్నట్టుగా సాగుతుంది ఈ రోజు అంటే మార్చి 27. ఈ క్రమంలోనే తల్లి సురేఖ కూడా కొడుకు బర్త్ డేను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేపట్టింది. గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో ప్రత్యేక పూజలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ పనులు అన్నీ కూడా ఉపాసన దగ్గరుండి చూసుకుంటుంది. ఈ కార్యక్రమంలో సురేఖ, అపోలో వర్కర్స్, పలువురు భక్తులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్బంగానే రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా రావడంతో 500 మంది భక్తులకు రామ్ చరణ్ పేరిట అన్నదానం చేశారు తల్లి సురేఖ. అత్తమ్మ కిచెన్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోడలు ఉపాసన సహాయంతో రీసెంట్ గా అత్తమ్మ కిచెన్ ను సురేఖ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అన్నదానం వీడియోను షేర్ చేయగానే ఫుల్ వ్యూస్ వచ్చాయి. ఇలా బిజినెస్ ప్రమోషన్ కూడా జరిగింది. ఇక రామ్ చరణ్ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి తిరుపతికి వెళ్లారు. ఉపాసన క్లింకారతో కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రామ్ చరణ్.