Revanth Reddy And VH: వీహెచ్ కు రేవంత్ అభిమాని ఫోన్.. ఆడియో లీక్ వైరల్

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా భారత రాష్ట్ర సమితిని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పెడుతుంటే.. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సరికొత్త ఆడియోను సర్కులేట్ చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 27, 2024 1:04 pm

Revanth Reddy And VH

Follow us on

Revanth Reddy And VH: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తుంటే.. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సరికొత్త ఆడియోను తెరపైకి తీసుకొచ్చారు. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ లో భాగమేనా? అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతమీ ఆ ఆడియో ఏంటి? ఎందుకంత సంచలనంగా మారింది? అందులో ఏమైనా చెప్పలేని విషయాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం చెబుతున్నారు భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు.

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా భారత రాష్ట్ర సమితిని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పెడుతుంటే.. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సరికొత్త ఆడియోను సర్కులేట్ చేస్తున్నారు. ఆడియోలో రేవంత్ రెడ్డి అభిమాని ఒకరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావుకు ఫోన్ చేశారు. “రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం పీకావ్? రేవంత్ రెడ్డి కి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. నువ్వు సీనియర్ గా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఏం చేశావంటూ” ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి హనుమంతరావు నిలదీశాడు. దానికి హనుమంతరావు కూడా ఫైర్ అయ్యారు. ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి సంభాషణ చాలా గరంగరంగా సాగింది. ఒకానొక దశలో వారిద్దరూ బూతులు మాట్లాడుకున్నారు. రాయలేని భాషలో తిట్టుకున్నారు.

ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎక్స్ పోజ్ చేస్తున్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఈ ఆడియో ను తెరపైకి తీసుకురావడం విశేషం. అప్పట్లో రేవంత్ రెడ్డి కి పిసిసి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగానే ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న నాయకుల్లో జగ్గారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, హనుమంతరావు వంటి వారు అడ్డుపడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై హనుమంతరావు బహిరంగంగానే తన నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో హనుమంతరావుకు రేవంత్ అభిమానులు వరుసగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారనే వార్తలు వినిపించాయి. దీనిపై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆడియోను తెరపైకి తెచ్చిన భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు.. “ఫోన్ ట్యాపింగ్ అంటే ఇదీ” అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఆడియో పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.” టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి చావకబారు ఆడియోలను రూపొందించడం భారత రాష్ట్ర సమితి నాయకులకే చెల్లిందని” వారు మండిపడుతున్నారు. “ఇలా ఆడియోలు విడుదల చేసినతమాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని” వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల హనుమంతరావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేయడం.. అది జరిగిన కొద్ది రోజులకే ఈ ఆడియో తెరపైకి రావడం.. అది కూడా భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం.. ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.