Jagan Assembly boycott: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరిగి మొదలైంది. ఎలాగైనా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీని బహిష్కరించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు 164, వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. ఘోర ఓటమిని మూటగట్టుకుంది. సాంకేతికంగా అసెంబ్లీలో మూడో పెద్ద పార్టీ. జనసేన రెండో పెద్ద పార్టీ.
2019 లో వైసీపీకి 151 సీట్లు , టీడీపీకి 23 సీట్లు వచ్చినా నాడు చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించలేదు. చంద్రబాబు అసెంబ్లీకి హాజరై ఫైట్ చేశారు.
ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో కాంగ్రెస్ ను చీల్చి పార్టీ పెట్టి ఘన విజయం సాధించారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సామాన్య వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఎన్నికలన్నాక బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి. ఆ తీర్పును గౌరవించడంలోనే హుందాతనం ఉంటుంది.
జగన్ తీరు మాత్రం విభిన్నంగా ఉంటుంది. న్యూట్రల్స్ సైతం జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని హర్షించడం లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారు. రాజ్యాంగ బద్దంగా ఇవ్వడానికి లేదు.
జగన్ అసెంబ్లీ బహిష్కరణ ప్రజా తీర్పుని అవమానించినట్లే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.