Jai Krishna Rajababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలామంది ఉన్నారు. అయినప్పటికి ఒకప్పుడు రాజబాబు చేసిన కామెడీ ముందు ఇప్పుడు చేస్తున్న కమెడియన్స్ కామెడీ చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తన మాటలతో తన ఆక్టివిటీతో ప్రేక్షకుడిని నవ్విస్తూ ఎన్నో సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం రాజబాబు తన సినిమాలో ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి… అలాంటి గొప్ప నటుడు అద్భుతమైన సినిమాలను చేశాడు. తన తమ్ముళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప స్టేజిలో ఉన్న విషయం మనకు తెలిసిందే… ఇక రాజబాబు తర్వాత చాలామంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాలో జై కృష్ణ అనే నటుడు తన కామెడీతో సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహించాడు.
Also Read: టీవీ5 సాంబ సార్ క్రికెట్ పాఠాలు.. నేర్చుకోండయ్యా?
మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జై కృష్ణ రాజబాబు ముని మనవడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇది అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. కానీ సోషల్ మీడియా మొత్తం జై కృష్ణ రాజబాబు యొక్క ముని మనమడు అంటూ వార్తలు రావడం వాటి మీద నెటిజన్లు సైతం కామెంట్లు అయితే చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది తాతకు తగ్గ మనమడు అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ, నిజంగానే జై కృష్ణ రాజబాబు ముని మనమడేనా కాదా అనే విషయాలు తెలియాలంటే జై కృష్ణ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది…
మరి ఏది ఏమైనా కూడా జై కృష్ణ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాలని చాలా మంది చెబుతున్నారు. అతని లాంటి కామెడీ చేసే వ్యక్తి ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో జన్యూన్ కామెడీ వస్తుందని లిటిల్ హార్ట్స్ సినిమాలో ఆయన కామెడీ నెక్స్ట్ లెవల్లో ఉండటం వల్లే ఈ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ ని సాధించింది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు…