Bharat : ‘భారత్’ అంటే గర్వపడాలి కానీ.. ఉలిక్కిపడడం అంటే ఏంటో అర్థం కావడం లేదు. భారత్ అనేది ఒక మత వాదం కాదు.. మన అందరి వాదం. భారత్ అనగానే వేల సంవత్సరాల నాగరికత.. అందరం గర్వపడే సాంస్కృతిక వారసత్వం ఉప్పొంగుతోంది. అటువంటిది.. ఇవాళ ‘భారత్’ అనే పేరుకు ఇంత వివాదం ఎందుకు?
మాది భారత్ కాదు ఇండియా అంటూ చాలా మంది అనడంపై ఇంత నెగెటివిటీ ఎంటో అంతుపట్టడం లేదు. నిజానికి హిందూ అనేది కూడా భారత్ కు సంబంధించింది కాదు. బ్రిటీష్ వాళ్లు రాకముందు మనల్ని పాలించిన పర్షియన్లు, అరబ్బులు, మొఘలులు ‘భారతదేశాన్ని’ హిందూస్థాన్ గానే పిలిచారు. సింధూ నది ఆవల ఉన్న ఈ ప్రాంతాన్ని హిందూస్థాన్ గా పిలవబడింది.
బ్రిటీష్ వారు వచ్చాక ‘ఇండస్’ నది (సింధూ నది) పేరు మీదుగా ‘ఇండియా’ అని ఇంగ్లీష్ పేరుకు దగ్గరగా ఆ పేరుతోనే పిలవడం స్ట్రాట్ చేశారు. కంపెనీలను పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఇండియా’గానే పాపులర్ అయ్యింది. అమెరికాలోని నేటివ్ ట్రైబర్స్ ను ‘ఇండియన్స్’ అంటారు. ఇక్కడి ఇండియన్స్ గానే చూస్తారు.
రాజ్యాంగంలోనే ‘భారత్’ అని ఉంది. అన్నింటిని మోడీ సర్కార్ మారుస్తోంది. ఇలా మార్చడంలోనూ తప్పు లేదు. ప్రఖ్యాత మద్రాసునే చెన్నైగా మార్చారు. నాడు ఎందుకు అడ్డు చెప్పలేదు. చారిత్రక పేరును ఉంచలేదు. ఇప్పుడు వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బాంబేను ముంబైగా మాల్చారు. కలకత్తను కోల్ కతాగా మార్చారు. రాజమండ్రిని ‘రాజమహేంద్రవరం’గా మార్చారు. బెజవాడను విజయవాడగా మార్చారు. అయితే ఇలా మార్చడం పై చర్చ ఇవాల్టి కాదు.
రాజ్యాంగ సభలో ‘ఇండియా’ పేరు ఉండాలా? ‘భారత్’గా ఉండాలా అనే దానిపై తీవ్ర చర్చ జరిగి ‘ఇండియా దటీజ్ భారత్’గా పేర్కొన్నారు.
మన ప్రాచీన నాగరికత, సాంస్కృతిక వారసత్వమే ‘భారత్’ అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.