Wrestlers Protest : నిన్నటి దాకా దేశం కోసం, నేడు తమ రక్షణ కోసమే కుస్తీ చేస్తున్న మహిళలు

భారత్ కు ఇంత ప్రతిష్ట తీసుకొచ్చిన వారిని రోడ్లపై నిరసన చేయేలా చేయడం మన దురదృష్టంగా చెప్పొచ్చు.. ఇప్పటికీ ఈ నిరసనను మళ్లీ ప్రారంభించారు.

Written By: NARESH, Updated On : May 4, 2023 11:32 pm
Follow us on

Wrestlers Protest – Vinesh Phogat : మహిళల కుస్తీ గెలుస్తుందా? అది రోడ్లపై జరుగుతున్న కుస్తీ. నాలుగు నెలలుగా అలుపెరగకుండా పోరాడుతున్న కుస్తీ. ఇది ఒలింపిక్ లో జరిగిన పోటీల కన్నా ఇది ప్రధానమైన సమస్య కాబోతోంది.

జనవరి 18వ తేదీన వినేష్ ఫొగట్ అనే ఒలింపిక్ విజేత ఒక నిరసన చేపట్టింది. ధర్నా చేసింది. ఈమెకు 10 మంది మహిళా కుస్తీ యోధురాళ్లు వచ్చి మమ్మల్ని రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ మమ్మల్ని వేధిస్తున్నాడని వాళ్ల ఆరోపణ. వాళ్లకు మద్దతుగా రంగంలోకి దిగింది కుస్తీ యోధురాలు దినేష్ ఫోగట్. వీరికి మద్దతుగా వివిధ రెజర్లు తరలివచ్చి మద్దతు ఇచ్చారు.

ఇది చూసి చాలా మంది స్వతంత్రంగా వచ్చారు. రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదు. బీజేపీ తరుఫున పోటీచేసిన వారు కూడా మద్దతు ఇచ్చారు. ఒక ప్రిన్స్ పుల్డ్ ఫైట్ చేశారు. వెంటనే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వారిని పిలిపించుకొని దాదాపు 8 గంటల పాటు మాట్లాడి చర్చలు జరిపారు. వెంటనే దీనిపై కమిటీ వేశారు. మేరికోమ్ అధ్యక్షురాలిగా పెట్టి బబిత ఫోగట్ ను అందులో సభ్యురాలిగా పెట్టారు. జనవరిలో వేసిన ఈ కమిటీ ఏప్రిల్ 5వ తేదీన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బయటపెట్టలేదు. దాంట్లో సభ్యురాలు బబిత చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కమిటీ కొంతమంది సాక్ష్యులను విచారించి దానిని నిర్ధారించుకోలేదు.

భారత్ కు ఇంత ప్రతిష్ట తీసుకొచ్చిన వారిని రోడ్లపై నిరసన చేయేలా చేయడం మన దురదృష్టంగా చెప్పొచ్చు.. ఇప్పటికీ ఈ నిరసనను మళ్లీ ప్రారంభించారు. నిన్నటి దాకా దేశం కోసం, నేడు తమ రక్షణ కోసమే కుస్తీ చేస్తున్న మహిళలపై ‘రామ్’ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.