Pawan Kalyan : జనసేన ఆధ్వర్యాన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రాలో మూడో శక్తి అవసరం. ఇదో చారిత్రక అవసరంగా మారింది. అది మరొక్క సారి ఇది రుజువైంది. ఎందుకంటే ఆంధ్రా ఏర్పడి ఇప్పటికీ 9 ఏళ్లు అయ్యింది. మొదటి ఐదేళ్లు చంద్రబాబు.. నాలుగేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అవినీతి పాలన మరకలు లేకుండా ఉండాలంటే.. అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీగా పోరాడాలంటే ఒక నైతిక హక్కు ఉండాలి. అవినీతి పరులకు ఎవరితోనూ మేం మిలాఖత్ కాము అని ముందు నిబద్ధతగా నిలబడాలి. వ్యవహరించాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు.
నిన్న సిట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలామందికి కనువిప్పు కలిగించింది. తప్పు ఒప్పుల సంగతి తర్వాత ముందు దర్యాప్తు అనేది అవసరం అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ నెట్, సహా టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరగకుండా హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటి? అని సుప్రీంకోర్టు తప్పు పట్టడం ఇక్కడ రాష్ట్రంలోని హైకోర్టు తీరు, పార్టీల అవినీతిని ఎత్తి చూపినట్టైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి వారికి చెంప పెట్టు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ఎవరూ దర్యాప్తు జరపొద్దా? వారి అవినీతిని బయటపెట్టొద్దా? వారికి ఇమ్యూనిటీ ఇవ్వాలా? అన్న దాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.
సిట్ పై సుప్రీంకోర్టు తీర్పు, స్కిల్ కుంభకోణంపై జనసేన వైఖరి ఎలా ఉండాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.