https://oktelugu.com/

Victory Venkatesh: బాలనటుడిగా విక్టరీ వెంకటేష్ ఎన్ని సినిమాలలో నటించాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా వెంకటేష్ కెరీర్‌లో డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూలీ నంబర్ 1, ధర్మచక్రం, క్షణ క్షణం, బొబ్బిలి రాజా, చంటి, సుందరకాండ, ప్రేమించుకుందాంరా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, దృశ్యం, గోపాల గోపాల, దృశ్యం 2 సినిమాలు వెంకటేష్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 5, 2023 7:26 pm
    Follow us on

    Victory Venkatesh: టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. మిగతా అగ్రహీరోలతో పోలిస్తే వెంకటేష్ కెరీర్‌లో విజయాలు ఎక్కువగా ఉంటాయి. వివాదాల జోలికి కూడా ఎక్కువగా పోయే మనిషి కాదు. దీంతో వెంకీ అంటే చాలా మంది అమితంగా ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, సొంత నిర్మాణ సంస్థ కూడా ఉండటంతో ఆఫర్ల కోసం వెంకటేష్ ఎప్పుడూ ఆందోళన పడరు. దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా వెంకటేష్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన నటనతో ఆయన అభిమానుల్లో క్రేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంది కలియుగ పాండవులు సినిమా వెంకటేష్ తొలి చిత్రంగా భావిస్తారు. కానీ చిన్నతనంలోనే ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా ఏదో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమ్‌నగర్‌లో వెంకీ నటించాడు.

    అవును మీరు విన్నది నిజమే. ప్రేమ్‌నగర్ సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపిస్తాడు. ఈ సినిమాలో తొలుత నటించమని తండ్రి రామానాయుడు తన కుమారుడు వెంకీని అడిగితే నో చెప్పాడట. కానీ ఈ సినిమాలో నటిస్తే రూ.వెయ్యి ఇస్తామని చెప్పడంతో వెంకటేష్ ప్రేమ్‌నగర్ సినిమాలో బాలనటుడిగా నటించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న తర్వాత కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ తెరంగేట్రం చేశారు. ఈ మూవీ ద్వారానే ఖుష్బూ కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. 1986లో ఆగస్టు 14న వెంకీ తొలి మూవీ కలియుగ పాండవులు విడుదలైంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును కైవసం చేసుకున్నాడు. వెంకటేష్ సినిమాల్లోకి వచ్చి 36 ఏళ్లు దాటుతోంది. 36 ఏళ్ల కెరీర్‌లో ఏడు నంది అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులను వెంకీ అందుకున్నాడు.

    కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా వెంకటేష్ కెరీర్‌లో డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూలీ నంబర్ 1, ధర్మచక్రం, క్షణ క్షణం, బొబ్బిలి రాజా, చంటి, సుందరకాండ, ప్రేమించుకుందాంరా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, దృశ్యం, గోపాల గోపాల, దృశ్యం 2 సినిమాలు వెంకటేష్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. వెంకటేష్ తన కెరీర్‌లో ఎక్కువగా నటి సౌందర్యతో ఎక్కువ సినిమాల్లో నటించాడు. వెంకటేష్, సౌందర్య జంట హిట్ పెయిర్‌గా నిలిచింది. మీనాతో కూడా వెంకటేష్ ఎక్కువ సినిమాల్లోనే నటించాడు.ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ శైలేష్ అనే దర్శకుడితో సైన్దవ్ అనే యాక్షన్ సినిమాని చేస్తున్నాడు.