Rahul Gandhi : రాహుల్ గాంధీ యాత్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను ముంచుతుందా?

ఈ సమయంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన రాహుల్ గాంధీ అవన్నీ వదిలేసి పాదయాత్ర చేపడుతున్నారు. రాహుల్ గాంధీ యాత్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను ముంచుతుందా? తేల్చుతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 28, 2023 2:07 pm

Rahul Gandhi : రాహుల్ గాంధీ జోడో యాత్ర అయిపోయింది.. ఇప్పుడు ‘భారత్ న్యాయ యాత్ర’ మొదలు కాబోతోంది. భారత్ జోడో యాత్రతో ఏదో పెద్ద హైప్ కాంగ్రెస్ కు వచ్చిందని బయట ప్రచారం చేసుకోవడం తప్పితే వాస్తవానికి ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం పెద్ద లాభం లేదనే చెప్పొచ్చు.

అసలు రాహుల్ గాంధీ ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసింది లేదు. గుజరాత్ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్లాడు. అక్కడ కాంగ్రెస్ ఓడింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది.. కానీ ఎక్కడా రాహుల్ గాంధీ ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. అదంతా రేవంత్ రెడ్డి క్రెడిట్ నే.. 11 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఆ మూడు రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత మీదనే కాంగ్రెస్ గెలిచింది. అంతే తప్ప రాహుల్ గాంధీ వల్ల ఏమాత్రం కాదు.

భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్రాల ఎన్నికలను రాహుల్ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ కు కావాల్సిన బూస్ట్ ను రాహుల్ ఇవ్వలేదు..