Shobha Shetty: బిగ్ బాస్ షోలో వరస్ట్ బిహేవియర్… కానీ శోభ శెట్టి స్టేట్ అవార్డు!

శోభా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు. కానీ శోభా శెట్టి ని ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సేవ్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని .. దత్త పుత్రిక కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.

Written By: NARESH, Updated On : December 28, 2023 12:01 pm
Follow us on

Shobha Shetty: బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లో శోభా 14 వారాలు జర్నీ కొనసాగించింది. బిగ్ బాస్ అనేది కొందరికి వరం అయితే ..మరి కొందరికి శాపం లాంటిది. హౌస్ లో తెలిసీ తెలియక చేసే తప్పులే వారి ఫేట్ ని డిసైడ్ చేస్తాయి. అలా ఈ సీజన్ 7 లో శోభా శెట్టి విపరీతమైన నెగిటివిటీ ని మూటగట్టుకుంది. తన వరెస్ట్ బిహేవియర్ తో ఆడియన్స్ లో చెడ్డ పేరు తెచ్చుకుంది.

దీంతో శోభా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు. కానీ శోభా శెట్టి ని ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సేవ్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని .. దత్త పుత్రిక కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. స్టార్ మా సపోర్ట్ లేకపోతే ఆమె అన్ని రోజులు ఉండేది కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న శోభా శెట్టి కి ఒక అవార్డు వచ్చింది.

శోభా శెట్టి కి ఉత్తమ ప్రతినాయకి గా రాష్ట్రీయ గౌరవ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని శోభా స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫోటోలతో సహా పోస్ట్ చేసింది. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ కి గాను బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు వచ్చిందని .. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలంటూ తను షేర్ చేసిన పోస్ట్ లో రాసుకొచ్చింది శోభా శెట్టి.

శోభా సీరియల్స్ నటిగా గుర్తింపు సంపాదించింది. ఆమె చేసిన సీరియల్స్ అన్నింటిలో కార్తీకదీపం లో మోనిత పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. చాలా మందికి శోభా మోనిత గానే తెలుసు. శోభా శెట్టి అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు .. కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అయితే ఈ సీరియల్ ద్వారా ఫేమ్ తో పాటు లైఫ్ పార్టనర్ కూడా సొంతం చేసుకుంది శోభా. మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న శోభా శెట్టి – యశ్వంత్ రెడ్డి లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.