Assembly by-election results : అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా ఉంది – సమగ్ర విశ్లేషణ

అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా వుంది - సమగ్ర విశ్లేషణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 9, 2023 1:51 pm

Assembly by-election results : ఆరు రాష్ట్రాల్లో ఏడు ఉప ఎన్నికల్లో జరిగాయి. ఇండియా కూటమి మాదే విజయం అని సంబరాలు చేసుకుంది. కానీ ప్రజలు అంత అమాయులు కాదు. ఇవి అసెంబ్లీ ఉప ఎన్నికలు. వీటిని బట్టి 2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నాయి. ఇక ఈ ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఏం లేవు.

మొత్తం 7 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో 5 స్థానాల్లో వారే విజయం సాధించారు. మరణించిన కుటుంబ సభ్యులే గెలిచారు. వెస్ట్ బెంగాల్, త్రిపురలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలుపు మారింది.

బెంగాల్ లోని దుప్ గురి ఒకప్పుడు బీజేపీ గెలవగా.. ఇప్పుడు టీఎంసీ గెలిచింది. అప్పుడు బీజేపీ కూడా 4వేల స్వల్ప మెజార్టీతోనే గెలిచింది. ఇప్పుడు టీఎంసీ కూడా 4వేల మెజార్టీతోనే గెలిచారు.

త్రిపురలోని బోక్సానగర్ సీపీఎం సీటు. ముస్లింలు మెజార్టీగా ఉండే సీటు. వీరు 50 శాతం అక్కడ ఉంటారు. సీపీఎం స్థానాన్ని ఈసారి బీజేపీ గెలిచింది. ముస్లిం నేత బీజేపీ తరుఫున ఎన్నికయ్యారు.

ఈశాన్యంలోని అతి చిన్న రాష్ట్రమైన త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలనూ బిజెపి గెలుచుకుంది. ధన్ పూర్, బాక్సా నగర్ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. బాక్సా నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందిన టాపా జ్జాల్ హోసైన్ ఏకంగా 30,237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.పోల్ అయిన ఓట్లలో 66% హోసైన్ కే పడటం విశేషం. ఆయన సమీప అభ్యర్థి మిజాన్ హోసైన్ కు( సీపీఐ(ఎం)) కు 3,909 ఓట్లు మాత్రమే పడ్డాయి.

ఇక ధన్ పూర్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి దేబ్ నాథ్ విజయం సాధించారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉంటే ఈ నియోజకవర్గంలో బిందు 18,871 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ జల్ పాయ్ గురి జిల్లా ధూప్ గురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్రరాయ్ 4,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2021 లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ భార్య తపసి రాయ్ ఇక్కడి నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. చంద్ర రాయ్ చేతితో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన సిపిఎం అభ్యర్థి ఐశ్వర్ చంద్రరాయ్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా వుంది – సమగ్ర విశ్లేషణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.