Miss Shetty Mr Polishetty Collections: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2వ రోజు వసూళ్లు… మెల్లమెల్లగా కొల్లగొడుతున్న అనుష్క-నవీన్!

ఈ సినిమా లో కొంచెం ఇబ్బంది పడే కంటెంట్ ఉన్న కానీ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు దొరుకుతుంది ఈ సినిమాకు.

Written By: Shiva, Updated On : September 9, 2023 12:20 pm

Miss Shetty Mr Polishetty Collections

Follow us on

Miss Shetty Mr Polishetty Collections: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క , యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అటు యూత్ ఆడియన్స్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది.

ఈ సినిమా లో కొంచెం ఇబ్బంది పడే కంటెంట్ ఉన్న కానీ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు దొరుకుతుంది ఈ సినిమాకు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఇండియా వైడ్ దాదాపుగా 2. 6 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. ఇక రెండో రోజు మరో 2 కోట్లు నెట్ వసూళ్లు చేసి , రెండు రోజులకు కలిపి 4. 6 కోట్లు నెట్ సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే మంచి వసూళ్లు అనే చెప్పాలి.

ఇక శనివారం , ఆదివారం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. నిజానికి తెలుగులో ఈ సినిమాకు జవాన్ సినిమా గట్టి పోటీ ఇస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన ఆ సినిమా పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తో నిండిపోవడంతో తెలుగులో ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక దశలో జవాన్ ముందు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నిలబడుతుందా అనే అనుమానాలు వచ్చాయి, కానీ సాయంత్రం టైం కి ఈ సినిమాకు బుకింగ్స్ ఊపందుకున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో శుక్రవారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు 139 షోలు పడితే అందులో 90 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ వీకెండ్ 2 డేస్ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ, స్వీటీ మార్క్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. నిజానికి తెలుగులో ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికిందనే చెప్పాలి. కాకపోతే షారుఖ్ సినిమా ఎఫెక్ట్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మీద గట్టిగా పడిందని చెప్పాలి