AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మంత్రులపై ఫైర్ అయ్యారు. తమ పనితీరు బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టం అన్నట్లు సంకేతాలిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘గడపగడపకు’ కార్యక్రమంలో కొందరు మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు తమ పనితీరు మార్చుకోకపోతే టికెట్ పై ఆశలు వదులుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా వీరి పనితీరుపై గమనిస్తున్న జగన్ ఒక్కసారిగా వారిపై కోపాన్ని తెచ్చుకోవడంపై పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంతలా కోపం తెచ్చుకోవడానికి వారు చేసిన పనేంటి..? కేబినేట్ లోని 5గురు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం లేదా..? ఆ ఐదుగురు ఎవరు..?

-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి:
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొంత మనిషిలా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు ఆప్త మిత్రుడు. ఆయన సీఎం సతీమణి గోశాలను ఏర్పాటు చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోవులను పంపించారు. జగన్ కు దగ్గరి బంధువులా ఉండే ఈయనపై సీఎం ఫైర్ అయినట్లు సమాచారం. అలాంటి వ్యక్తి పనితీరు బాగాలేదని జగన్ తేల్చేశారు. మొదటి నుంచి వ్యక్తిగతంగా తనకు ఆప్తమిత్రుడిలా ఉన్న చెవిరెడ్డికి సైతం టికెట్ రాదన్న సంకేతాలు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను పట్టించుకోకపోతే ఎవరైనా సరే టికెట్ పై ఆశలు వదులుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
-కొడాలి నాని:
జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన కొడాలి నాని పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. ప్రతిపక్షాలను విమర్శించడంలో ముందుండే నాని జగన్ ను అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. అలాంటి కొడాలి నానిని కూడా పనితీరు బాగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు పడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జగన్ తరుపున మీడియా ముందు వాదించే ఆయన.. ప్రజలతో సత్సంబంధాలు ఉంచుకోకపోతే టికెట్ వచ్చే అవకాశం లేదన్నట్లు చెప్పారు.
-బుగ్గన రాజేంద్రనాథ్:
ఏపీ కీలక మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ ఒకరు. అయితే తన సొంత నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు తక్కువేనని ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంద. అయితే ఆర్థిక మంత్రి అయినందున, ఆ వ్యవహారాలు చూసేందుకు ఎక్కువడగా ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది.. అందుకే ప్రజలతో కలవలేకపోతున్నారని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. కానీ జగన్ ప్రవేశపెట్టిన గడపగడపకు కార్యక్రమంలో ప్రజలతో సత్సంబంధాలు లేకపోతే ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయిన జగన్ అన్నట్లు తెలుస్తోంది. తన పదవీ కాలం మొత్తం ఢిల్లీలో ఉన్నా సరే.. నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు ఉండాలని, లేకపోతే చివరి నిమిషంలో నష్టపోయేది మీరే అన్నట్లు జగన్ అన్నారు.
-వల్లభనేని వంశీ:
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినా.. కీలకంగా ఉంటున్నారు వల్లభనేని వంశీ. అయితే ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయం అని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఉంటే టికెట్ వచ్చే అవకాశాలుండని జగన్ హెచ్చరించారు. ప్రతిపక్షాలను ఏ విధంగా విమర్శించినా సరే ప్రజలతో సంబంధాలు కరువైతే పోను పోను మీకే నష్టం జరుగుతుందని జగన్ హెచ్చరించారు.
-సజ్జల రామకృష్ణారెడ్డి:
తనకు ఆత్మగా పనిచేసే సజ్జల రామకృష్ణరెడ్డిని కూడా జగన్ హెచ్చరించారు. తాడేపల్లిలో జగన్ కంటే ముందుగా ఉండే వ్యక్తి సజ్జల మాత్రమే. ప్రతీ విషయాన్ని సున్నితంగా డీల్ చేస్తూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అయినా ప్రజలతో మమేకమై ఉండాలని, వారి నుంచి వ్యతిరేకత వస్తే మొదటికే మోసం అవుతుందని ఆయన పేరు పెట్టి మరీ హెచ్చరించారు. ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకోవాలని లేదంటే టికెట్ పై ఆశలు వదులుకోవాలని అన్నారు.
దశాబ్దాల చరిత్ర ఉన్న నాయకులైనా సరే.. ప్రజలు తిరగబడితే ఇంట్లో కూర్చుంటారని జగన్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న మీకు ప్రజలతో ఎలా ఉండాల తెలియదా..? అన్నట్లు మాట్లాడారు. అయితే తనకు దగ్గరిగా ఉన్న వ్యక్తులకు ప్రజల్లో వ్యతిరేకత వస్తే టికెట్ చేజారిపోకుండా జగన్ పాజిటివ్ కోణంలో వారిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.