Bigg Boss 6 Lady Contestants: బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో ఎలిమినేషన్ కి వేళయింది. వీకెండ్ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆదివారం ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయనున్నాడు. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ తో లేటెస్ట్ సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. గతంతో పోల్చితే కొంచెం తెలిసిన ముఖాలను హౌస్లోకి పంపారు. సింగర్ రేవంత్, నటుడు బాల ఆదిత్య, జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి, ఫైమా, సీరియల్ నటి కీర్తి, సుదీప వంటి సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఇక మొదటి వారం ఇనయా, అభినయశ్రీలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అనూహ్యంగా బిగ్ బాస్ ఇద్దరినీ సేవ్ చేశాడు. అయితే సెకండ్ వీక్ ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. సరిగా ఆట ఆడటం లేదన్న నెపంతో నటుడు షానిని ఎలిమినేట్ చేయడం జరిగింది. అలాగే ఎలిమినేషన్ కి నామినేటైన అభినయశ్రీ తక్కువ ఓట్లతో హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక మూడవ వారం ఎలిమినేషన్ లో వాసంతి, నేహా చౌదరికి తక్కువ ఓట్లు వచ్చాయి. వీరిలో వాసంతి సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున నేహా చౌదరిని ఎలిమినేట్ చేశారు.

కాగా నాలుగో వారం ఎలిమినేషన్ కి పది మంది నామినేట్ అయ్యారు. హౌస్ లో పెర్ఫార్మన్స్ సరిగా లేదని కీర్తి భట్, అర్జున్ కళ్యాణ్ లను గత వారం నాగార్జున నేరుగా నామినేట్ చేశారు. ఇక కంటెస్టెంట్స్ మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియలో 8 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. కీర్తి భట్, అర్జున్ కళ్యాణ్, రేవంత్, గీతూ రాయల్, సుదీప, రాజ్, సూర్య, ఇనయ, శ్రీహాన్, ఆరోహి మొత్తం 10 మంది నామినేట్ అయ్యారు.
ఈ పది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి కొనసాగుతుంది. బయటికొచ్చిన తాజా ఓటింగ్ లెక్కల ప్రకారం… మోడల్ రాజ్, ఆరోహి, సుదీప డేంజర్ జోన్లో ఉన్నారట. ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కి మిగతా వారికంటే తక్కువ ఓట్లు వచ్చాయట. ఈ ముగ్గురిలో రాజ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయట. డేంజర్ జోన్లో లేడీ కంటెస్టెంట్స్ ఆరోహి, సుదీప ఉన్నారట. వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ హౌస్ ని వీడిన నేపథ్యంలో మరో లేడీ తట్టా బుట్టా సర్దనున్నట్లు సమాచారం.
