Pawan Kalyan Craze: పవన్ కళ్యాణ్ క్రేజ్ ని ఢీ కొట్టే హీరో లేడు అని అభిమానులు అంటూ ఉంటారు..ఇది కొంతమంది అతిశయం అని అనడం మనం చాలా సందర్భాలలో చూసాము..కానీ అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు అని పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటుంది..దానికి మరో ఉదాహరణ గా నిలిచింది ఈరోజు జరిగిన ఒక సంఘటన..ఇక అసలు విషయానికి వస్తే సుమారు 350 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో, మోషన్ కాప్చర్ టెక్నాలిజీ తో తెరకెక్కుతున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ని ఈరోజు విడుదల చేసింది మూవీ యూనిట్..అంతే కాకుండా ఈ సినిమా టీజర్ ని అక్టోబర్ 2 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు కూడా తెలిపారు.,అయితే శ్రీ రాముని గెటప్ లో ఉన్న ప్రభాస్ ఆది పురుష్ ప్రీ లుక్ కి అభిమానుల నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రీ లుక్ ని రామ్ చరణ్ ఫాన్స్ తమ హీరో #RRR లుక్ తో పోలుస్తూ శ్రీ రామునిగా ప్రభాస్ కంటే రామ్ చరణ్ బాగుంటాడు అంటూ పోలికలు చెయ్యడం ప్రారంభించారు..అలా ఈ ఇద్దరు హీరోలు సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సమయం లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏం ఏం కీరవాణి గారు పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు..అంతే అప్పటి వరుకు అందరి ద్రుష్టి ఆది పురుష్ మీద ఉండగా..ఎప్పుడైతే కీరవాణి ఆ ఫోటో అప్లోడ్ చేసాడో, అప్పుడు ద్రుష్టి మొత్తం పవన్ కళ్యాణ్ కొత్త లుక్ మీదకి వెళ్ళింది..సన్నని గెడ్డం తో ఎరుపు రంగు టీ షర్ట్ తో ఎంతో స్టైలిష్ గా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారిపోయింది..ఎక్కడ చూసిన ఈ ఫోటోనే ట్రెండ్ అవుతూ వెళ్ళింది..ఇక సాయంత్రం సమయం లో హరి హర వీరమల్లు వర్క్ షాప్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేసారు..దానికి వచ్చిన రెస్పాన్స్ లో పావు శాతం కూడా ఆది పురుష్ ఫస్ట్ లుక్ కి రాలేదు అంటున్నారు విశ్లేషకులు..ఎన్ని పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఎవ్వరు నిలబడలేరని ఆయన అభిమానులు ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నారు.
