Sandeshkhali : బెంగాల్ లో ‘సందేశ్ ఖలి’ ఒక ఘోర కలిగా మారింది. గత 6వ తేదీ నుంచి ఇది రగులుతూనే ఉంది.ఇది బయటకు రాకుండా బెంగాల్ మీడియాను సీఎం మమతా బెనర్జీ కట్టడి చేసింది. రిపబ్లిక్ లాంటి కొన్ని చానెల్స్ లో మాత్రమే వచ్చింది.
అయితే కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకు బెంగాలీ వచ్చు. ఆవిడ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి రాసి జాతీయ స్థాయికి తీసుకొచ్చారు. దేశం మొత్తం అక్కడి వారికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతోంది.
కోల్ కతా కు దగ్గరలోని సందేశ్ ఖలిలో మహిళలు ఈ ఉద్యమం చేశారు. భూసమస్యలు, భూకబ్జాలు, మహిళలపై అత్యాచారాలు చేశారని అక్కడి మహిళలు పోరాటం చేశారు. తృణమూల్ నాయకులు అక్కడ దారుణాలకు పాల్పడుతున్నారని బయటకు వచ్చారు. పార్టీ వర్క్ పేరిట మహిళలను పిలిచి వారిపై అత్యాచారాలు చేసేవారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ రైతాంగ కమ్యూనిటీలే ఉంటారు. షేక్ షాజహాన్ తోపాటు అతడి అనుచరులు కలిసి ఈ దారుణాలకు పాల్పడ్డారు.
రొహింగ్యాల అండదండలతో తృణాముల్ నాయకుల అకృత్యాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.