https://oktelugu.com/

Hero Nani: హీరో నాని కి ఆప్షన్ లేకుండా పోయిందే!

ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుందని నందమూరి అభిమానులు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఎన్నికలు ఉండడంతో ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలు ఎక్కువయ్యాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 13, 2024 / 02:39 PM IST

    Hero Nani

    Follow us on

    Hero Nani: సినిమాలకు మంచి డేట్స్ దొరకడం కష్టమే. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను, వారి హాలీడేస్ ను, పండుగలను, స్పెషల్ డేస్ లను దృష్టిలో పెట్టుకోవాలని థియేటర్లలోకి రావాలి అనుకుంటారు. అయితే ప్రస్తుతం ఆగస్ట్ 15 కోసం యుద్దం జరుగుతున్నట్టుగా ఉంది. ఇంతకీ ఆ రోజు ఎవరు థియేటర్ లో ఉంటారో ఓ సారి చూసేద్దాం..

    ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుందని నందమూరి అభిమానులు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఎన్నికలు ఉండడంతో ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలు ఎక్కువయ్యాయి. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకున్నా.. ఈ సినిమా వాయిదా అనేది పక్కా అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆ రోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవబోతుందనే టాక్ వస్తుంది. ఇక దేవర రూట్ లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా పడుతుందనే టాక్ వస్తుంది.

    అంతే కాదు పుష్ప రాజ్ ప్లేస్ లో దేవర సినిమా వస్తుందనే టాక్ వచ్చింది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ ఎట్టిపరిస్థితుల్లో అయినా ఆగస్టు 15కు పుష్ప 2 సినిమా వస్తుందని క్లియర్ కట్ గా చెప్పేశారు. కానీ పుష్ప 2 వాయిదా పడడం కచ్చితం అంటూ రూమర్స్ అయితే ఆగడం లేదు. ఎందకంటే బాలీవుడ్ లో ఇదే డేట్ కి అజయ్ దేవగన్ నటించిన సింగం సినిమా రిలీజ్ అవుతుంది. సింగం-పుష్ప 2లు గనుక క్లాష్ అయితే పుష్ప కి నార్త్ లో థియేటర్స్ ఇష్యూ రావడం పక్కా అని టాక్.

    ఈ పాయింట్ ను కన్సిడర్ చేసుకొని ఒకవేళ పుష్ప 2 గనుక వెనక్కి వెళ్తే మాత్రం అదే డేట్ కి దేవర కాకుండా నాని వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రిలీజ్ డేట్ ను ఆగస్టు 15కి లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఒకవేళ పుష్ప రాజ్ అనుకున్న సమయానికే వస్తే.. ఈ సినిమాను ఆగస్ట్ 29న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుత ఈ రెండు డేట్స్ తో సతమతమవుతున్నారు మేకర్స్. ఇక పుష్ప 2 ఫైనల్ అయితే గానీ ఈ సినిమా బృందం టెన్షన్ పోదు. మరి చూడాలి ఏ సినిమా ఏ రోజు వస్తుందో…