Sandeshkhali violence : బెంగాల్ లో ఏం జరుగుతోంది. గత 8 , 9 రోజుల నుంచి మహిళల నిరసనలు ఆగడం లేదు. ఉధృతంగా జరుగుతున్నాయి. పోలీసులు బెదిరించినా.. భయపెట్టినా మహిళలు గొంతుకను ఆపడం లేదు. ఏ మహిళ అయినా తన మీద మానభంగం జరుగుతోందని.. రాత్రి పార్టీ వర్క్ పేరిట తీసుకెళుతున్నారని ఆరోపిస్తున్నారు. పదుల్లో మహిళలు ఇలా బయటకు రావడం చూస్తే బెంగాల్ లో తృణమూల్ నేత ఆకృత్యాలు వెలుగుచూస్తున్నాయి..
ఇంత మంది గొడవ చేసినా మహిళలు వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు ఎంత భయపెట్టినా కర్రలతో రోడ్డుపైకి వచ్చి తమ ప్రతాపం చూపిస్తున్నారు. షేక్ షాజహాన్ ఆయన అనుచరులు మహిళలను శృంగార బానిసలుగా మార్చిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అందరూ ఒక్కటై ఖండించాల్సిన సంఘటన ఇదీ
అయినా మమతా బెనర్జీకి ఇందులో రాజకీయం కనిపిస్తోంది… తప్పితే మహిళగా సాటి మహిళలకు అండగా నిలవడం లేదు. పదవి కోసం మమత చేస్తోన్న కుఠిల రాజకీయంపై విమర్శలు వినిపిస్తున్నాయి..
మమతా ప్రవర్తన ఒకనాటి సిపిఎం వైఖరి కన్నా ఘోరంగా ఉంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.