Mutamestri Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ముఠామేస్త్రి సినిమా ఒకప్పుడు పెను సంచలనాన్ని సృష్టించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక మంచి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా రోజా, మీనా ఇద్దరు నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి.
ఒక ముఠాకి మేస్త్రీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఒక సామాన్య మానవుడు ఒక రాష్ట్రానికి సీఎం అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించిన విధానం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో చివర్లో కోర్టు సీన్ ఉంటుంది.ఆ సీన్ లో సాక్ష్యం కోసం పక్కన మసీదులో ఒక ముస్లిం నమాజ్ చేస్తూ ఉంటే దాన్ని సాక్ష్యంగా సృష్టిస్తూ దోషులకు శిక్ష విధించాలి అంటూ చిరంజీవి సినిమాలో వాదిస్తాడు. అప్పట్లో ఈ సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సీన్ ను ఒక కొరియన్ సినిమా లో నుంచి తీసుకొని దాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. దీని మీద సినిమా యూనిట్ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. అయితే అప్పట్లో మాత్రం ఈ సీన్ కొరియన్ సినిమా నుంచి కాపీ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా సక్సెస్ లను కూడా సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా 200 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన సీనియర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే చిరంజీవి సూపర్ సక్సెస్ సాధించడానికి ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉంటున్నాడు… ఇక ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో ‘విశ్వంభర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో కనక సూపర్ సక్సెస్ కొడితే చిరంజీవి మార్కెట్ ఇంకా భారీగా పెరుగుతుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…