Manipur – PM Modi : మణిపూర్ లో జరుగుతున్నది ఓ సివిల్ వార్.ఆయుధాలు పట్టుకున్న రెండు తెగల మధ్య జరుగుతున్న వైరం. మారుమూల సరిహద్దు రాష్ట్రం మణిపూర్ లో ఇది జరుగుతోంది. థాయ్ లాండ్ కు రోడ్డు ద్వారా వెళ్లడానికి ఆ మార్గమే కీలకం. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మొదట వచ్చింది కూడా మణిపూర్ ద్వారానే. అలాంటి నేలలో ఇప్పుడు కుక్కీలు మైత్రీల మధ్య వైరం పతాకస్థాయికి చేరింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింస చెలరేగింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించి భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగించారు. ఈ హింసను అదుపుచేయడానికి పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. అవసరమైతే ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
మోడీ కిది కఠిన పరీక్ష గా మారిన మణిపూర్ లో హింసపై ఏం చేయాలి? : ముందుగా ముఖ్యమంత్రిని తొలగించాలి.. దీనిపై సమగ్ర విశ్లేషణను ‘రామ్ ’ గారి కింది వీడియోలో చూడొచ్చు.