Homeఎడ్యుకేషన్Moonlighting: మూన్‌లైటింగ్‌ తప్పయితే.. అకారణంగా ఉద్యోగం తొలగింపు న్యాయమా?

Moonlighting: మూన్‌లైటింగ్‌ తప్పయితే.. అకారణంగా ఉద్యోగం తొలగింపు న్యాయమా?

Moonlighting: మూన్‌లైటింగ్‌.. ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం.. ఇది నేరమని, చాలా తప్పని ఐటీ కంపెనీల యాజమాన్యాలు అంటున్నాయి. మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు. తక్కువ వేతనాలతో మానవ వనరులు వినియోగించుకునే అవకాశం దొరుకుతుందని పేర్కొంటున్నారు.

Moonlighting
Moonlighting

మూన్‌లైటింగ్‌ అంటే..
మూన్‌లైటింగ్‌ అనేది కొత్తగా వినిపిస్తున్న పదం. చాలామందికి అర్థం తెలియదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఉద్యోగి.. ఒక సంస్థలో పూర్తిస్థాయి ఎంప్లాయ్‌గా పనిచేస్తూ … ఖాళీ సమయంలో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుని పనిచేయడం. ఇది ఇటీవల పెరిగింది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఈ ధోరణి బాగా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా ప్యాండమిక్‌ సమయంలో ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాయి. దీంతో ఉద్యోగికి, యజమానికి మధ్య దూరం పెరిగింది. ఒక ఉద్యోగం దొరకకే కిందా మీదా పడుతుంటే.. కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచం మీద కరోనా విధ్వంసం చేస్తే కొందరికి మాత్రం అది వరంగా మారింది. ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం తమ తెలివిని, శ్రమను పెట్టుబడిగా పెట్టి.. ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పూర్తి ఎంప్లాయ్‌గా ఉన్న సంస్థకు పనిచేస్తూనే, పార్ట్‌టైం ఒప్పందం చేసుకున్న సంస్థకు మిగతా సమయంలో పనిచేస్తున్నారు.

ఐటీ రంగంలో ఎక్కువ..
ఐటీ సంస్థలు తమ ఉద్యోగులు టాలెంట్‌ మొత్తం తమ సంస్థ కోసమే వెచ్చించాలని భావిస్థాయి. ఇందుకోసం మంచి వేతనాలు కూడా ఇస్తున్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్‌ కాలంలో వర్క్‌ ఫ్రం హోంకు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాయి. కానీ వర్క్‌ ఫ్రం హోం వల్ల అనేకమంది ఉద్యోగులు పక్కదారులు తొక్కారు. డెడికేటెడ్‌గా వేరువేరు ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తూనే మరో కంపెనీకి కన్సెల్టెంట్‌గా సేవలందిస్తున్నవారు. నిజానికి ఆయా కంపెనీలు కాంపిటీటర్లు. సహజంగానే ఈ విషయం తెలిసి అనేక కంపెనీలు డిస్టర్బ్‌ అవుతున్నాయి.

సాఫ్ట్‌వేర్, కంపెనీ సీక్రెట్స్‌ రివీల్‌ అయ్యే అవకాశం..
మూల్‌లైటింగ్‌ చాలా నేరమని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్‌ అభిప్రాయపడ్డారు. ఒక సంస్థలో ఉద్యోగి అయి ఉండి.. ఇంకో సంస్థకు కన్సల్టెంట్‌గా చేయడం తప్పని పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీ లాయల్టీ దెబ్బతింటుందని పేర్కొన్నారు. మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్న కంపెనీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సంస్థలో పూర్తి ఉద్యోగి అయి ఉండి.. ఇంకో సంస్థకు పనిచేయడం వలన ఒక సంస్థ రహస్యాలు ఇంకో సంస్థకు తెలిసే అవకాశం ఉంటుందని, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసే సాఫ్ట్‌వేర్‌ దుర్వినియోగం అవుతుందని పేర్కొంటున్నారు. మూన్‌లైటింగ్‌పై ఆలస్యంగా కళ్లు తెరిచిన కంపెనీలు ఇప్పుడు వర్క్‌ఫ్రం హోంను రద్దు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న ఉద్యోగులు వాటిని రద్దు చేసుకోకుండా ఖాళీ సమయంలో పని కొనసాగిస్తున్నారు.

ఒత్తిడి పెరుగుతుంది.. క్వాలిటీ దెబ్బతింటుంది...
మూన్‌లైటింగ్‌లో ఉద్యోగిపై ఒత్తిడి పెరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐటీరంగం అనేది పూర్తిగా మెంటల్‌ వర్క్‌. ఒక సంస్థకన్నా ఎక్కువ సంస్థలతో పనిచేయడం వలన ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురవుతాడని మూన్‌లైటింగ్‌ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా వర్క్‌ ఎఫిషియన్సీ దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. తద్వారా ప్రాజెక్టు క్వాలిటీ తగ్గుతుందని, సంస్థ రిలయబిలిటీ పోతుందని అంటున్నారు.

Moonlighting
Moonlighting

పలురంగాల్లో మూన్‌లైటింగ్‌..
ఈ మూన్‌లైటింగ్‌ విధానం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఇలా ఒకటికంటే ఎక్కువ పనులు చేస్తుంటారు. ప్రభుత్వ వైద్యులు ఆస్పత్రుల్లో వైద్యం చేయకుండా ప్రైవేటు క్లినిక్‌లు ప్రారంభించి అక్కడి మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. టీచర్లు.. స్కూళ్లలో సరిగా పాటాలు చెప్పకుండా పిల్లలను ట్యూషన్‌కు రావాలని సూచిస్తుంటారు. కొంతమంది ఉద్యోగులు ఇన్సూరెన్స్‌ ఏజెంట్లుగా, రియల్టర్లుగా, రియల్‌ఎస్టేట్‌ సంస్థలకు ఏజెంట్లుగా కూడా పనిచేస్తున్నారు. మరోవైపు కొన్ని సంస్థలు మూన్‌లైటింగ్‌ను స్వాగతిస్తున్నాయి. స్విగ్గీ అయితే తాము మూన్‌లైటింగ్‌ను సమర్థిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పైరంగాలతో పేల్చితే.. ఐటీరంగం పూర్తిగా భిన్నం. సంస్థ ఎఫిషియెన్సీ ఆధారంగానే ప్రాజెక్టులు వస్తుంటాయి. ఒక్కసారి క్రెడిబులిటీ దెబ్బతింటే.. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని మూన్‌లైటింగ్‌ వ్యతిరేకులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే కొన్ని కంపెనీలు మాత్రం…ఎక్కడ పని చేస్తే ఏముందిలే… మా కంపెనీ టాస్క్‌ కంప్లీట్‌ చేస్తే చాలు అనే ధోరణిలో ఉంటున్నాయి. అయితే ఇలా ఆలోచిస్తున్నవి చిన్న కంపెనీలు మాత్రమే. ఎందుకంటే ఈ రేంజ్‌ కంపెనీలకి వర్క్‌ ఫ్రం హోం వల్ల ఆఫీస్‌ రెంటల బెడద తప్పింది. ఓవర్‌ హెడ్‌ ఖర్చులు లేకుండా మంచి లాభాలు ఆర్జించడం, కుదిరితే కాంపిటీటివ్‌ గా తక్కువ ధరలకే సాఫ్ట్‌ వేర్‌ సేవలు అందించడం చేస్తున్నాయి.

ఉద్యోగుల తొలగింపు మాటేమిటి..
అయితే మూన్‌లైటింగ్‌ను సమర్థించే వారు మాత్రం మూన్‌ౖలైటింగ్‌ నేరమయితే.. పెద్దపెద్ద కంపెనీలు కూడా అకారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి కదా, మరి ఇది ఎలా న్యాయం అని ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులకు భద్రత కల్పించకుండా, ఇష్టానుసారం తొలగిస్తూ, ఔట్‌సోర్సింగ్‌ను ప్రోత్సహిస్తూ, మూన్‌లైటింగ్‌ నేరమనడం ఎంతవరకు సమంజసమంటున్నారు. కొంతమంది అదనపు ఆదాయం కోసం ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుంటే చాలా మంది ఉద్యోగ భద్రత లేనికారణంగానే తమ నాలెడ్జిని పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారని మూన్‌లైట్‌ను సమర్థించేవారు చెబుతున్నారు. ఇక కొంతమంది ప్రొఫెషన్స్‌ మల్టీ కంపెనీలతో అగ్రిమెంట్‌ చేసుకుని వర్క్‌ చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా పెద్ద కంపెనీలు పట్టించుకోవడం లేదు. కారణం ప్రొఫెషనల్స్‌ను పోగొట్టుకుంటే మళ్లీ దొరకరని. చిన్నచిన్న ఉద్యోగుల విషయంలో మాత్రమే మూన్‌లైటింగ్‌ నేరమని అభిప్రాయపడుతున్నారు. తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేయించుకుంటూ తమ సంస్థకే పనిచేయాలని అడగడం సరికాదని కొందరు పేర్కొంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular