King Charles III: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణం తరువాత ప్రిన్స్ గా చార్లెస్ 3 రాజుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన జీవన విధానంపై అందరికి ఉత్సాహం కలుగుతోంది. ఆయన ఏం తింటారు? ఎలా తింటారు? ఏమేం పదార్థాలు తీసుకుంటారనే దానిపై అందరిలో ఉత్సుకత ఏర్పడింది. చార్లెస్ 3 అలవాట్లు, అభిరుచులు ఏంటనే దానిపై అందరికి సందేహాలున్నాయి. ఆయన ఏం తింటారు? మనలాగే ఉంటారా? లేక ప్రత్యేకంగా ఏదైనా తింటారా? అనే కోణంలో సంశయాలు రావడం సహజమే. సెలబ్రిటీల గురించి ప్రజల్లో ఉత్కంఠ ఏర్పడటం మామూలే. దీంతో ఆయన జీవన విధానం ఎలా ఉంటుందోననే తెలుసుకోవాలని ఉద్దేశం అందరిలో వస్తోంది.

చార్లెస్ కు సంబంధించిన అలవాట్లపై ఆయనకు సేవలు చేసే సిబ్బంది చెప్పిన వివరాల మేరకు ఆయన తన సొంత టాయిలెట్ సీటు, క్లీనెక్స్ వెల్వెట్ టాయిలెట్ పేపర్ తీసుకెళ్తారనే విషయం తెలిపింది. దీంతో చార్లెస్ కు సంబంధించిన 2015లో సర్వింగ్ రాయల్స్, ఇన్ సైడ్ ది ఫర్మ్ అనే డాక్యుమెంటరీలో పలు విషయాలు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. చార్లెస్ మొదట డయానాను వివాహం చేసుకున్నా ఆమెతో విడాకులు తీసుకున్నారు. డయానా మరణం తరువాత 2005లో కెమిల్లా పార్కర్ బౌల్స్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రిన్సెస్ డయానా రాణికి బట్లర్ గా పనిచేసిన పాల్ బరెల్ చెప్పిన విషయాలను ఆ కథనంలో పేర్కొంది.
చార్లెస్ ఉదయం పూట పైజామాలు, షూ లేస్ లను ఇస్త్రీ చేయించుకుంటారు. బాత్ ఫ్లగ్ నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలి. స్నానానికి గోరువెచ్చటి నీళ్లు ఉండేలా చూసుకుంటారు. ఇంకా నీళ్లు నిండుగా ఉండకూడదు. ఉదయం ఒక అంగుళం పరిమాణంతో ఉన్న బ్రష్ నే ఉపయోగిస్తారు. చార్లెస్ ఆహారపు అలవాట్లలో అల్పాహారంలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉండే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఇంట్లో తయారు చేసిన రొట్టెలు, తాజా పండ్లు, వాటి రసాలను తీసుకునేందుకు ఇష్టపడతారు.

చార్లెస్ ఎక్కడికి వెళ్లినా బ్రేక్ ఫాస్ట్ బాక్స్ ను ఆయన వెంట తీసుకెళ్తారు. ఆరు రకాల తేనెలు, మస్లిస్, డ్రైఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీలో పలు ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ఎలిజబెత్ 2 మరణం తరువాత చార్లెస్ రాజ సింహాసనం వరించింది. దీంతో ఆయన బ్రిటన్ రాజుగా ఎన్నికై తనదైన శైలిలో వ్యవహారాలు చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి బ్రిటన్ రాజు చార్లస్ 3 జీవన విధానంపై అందరిలో ఉన్న ఆతృతతో న్యూయార్క్ లోని పత్రిక పలు విషయాలతో ఆయన అలవాట్లను ప్రచురించింది.