Tapas Roy Resigns : కునాల్ ఘోష్ పదవికి, తపస్ రాయ్ పార్టీకి రాజీనామాలు మమతా కి కోలుకోలేని దెబ్బ

Tapas Roy Resigns: కునాల్ ఘోష్ పదవికి, తపస్ రాయ్ పార్టీకి రాజీనామాలు మమతా కి కోలుకోలేని దెబ్బ

Written By: NARESH, Updated On : March 6, 2024 7:01 pm

Tapas Roy Resigns : పశ్చిమ బెంగాల్.. మమతా బెనర్జీ.. అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా మమతా బెనర్జీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మమతా ఇమేజ్ ఘోరంగా దేశవ్యాప్తంగా డ్యామేజ్ అయ్యింది. మమతాకు 50 శాతం మార్కులు వేసే వాళ్లు లేరు. సందేశ్ ఖలి వ్యవహారం మమతా బెనర్జీ పాపులారిటీ చాలా దిగజార్చింది.

మమతా బెనర్జీ పాలనలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఎలా గెలిచిందన్న సందేహం రాకమానదు.. బీజేపీ తప్పులే మమత గెలుపునకు కారణం అయ్యింది. ఈసారి మమతా కేబినెట్ లోని ఎంతో మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

సీనియర్లు అందరూ మమత నుంచి వెళ్లిపోతున్నారు. పోయిన సారి ముకుల్ రాయి వెళ్లిపోగా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి బయటకొచ్చి బీజేపీ వెంట నడిచారు. ఇక మంత్రి పార్థ చటర్జీ వద్ద కోట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆయన ఫియాన్సీ వద్ద దొరకడం సంచలనమైంది. పశ్చిమ బెంగాల్ లో అనుబ్రత మండల్ కీలక మంత్రి.. చాలా ఆర్థిక వనరులున్న మంత్రి. ఆయన అవినీతి చేసి జైలు పాలయ్యాడు. మంత్రి జ్యోతి ప్రియ మాలిక్ రేషన్ స్కాంలో వేల కోట్లు తినేశాడు. జ్యోతి ప్రియ శిష్యుడే షేక్ షాజహాన్. ఇతడే సందేశ్ ఖలి సూత్రధారి.. ఇవన్నింటితో మమతా బెనర్జీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.

కునాల్ ఘోష్ పదవికి, తపస్ రాయ్ పార్టీకి రాజీనామాలు మమతా కి కోలుకోలేని దెబ్బ.. బెంగాల్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.