Homeఎంటర్టైన్మెంట్Nagarjuna brings motion capture technology: మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని తీసుకువచ్చిన నాగార్జున... దీనివల్ల...

Nagarjuna brings motion capture technology: మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని తీసుకువచ్చిన నాగార్జున… దీనివల్ల ఉపయోగం ఏంటంటే..?

Nagarjuna brings motion capture technology: ప్రస్తుతం ప్రపంచ ప్రేక్షకులందరు విజువల్ వండర్ సినిమాలకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు… అలాంటి సినిమాలు చేయడానికి దర్శకులు మోషన్ క్యాప్చర్ సెటప్ ను వాడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ అయిన ‘జేమ్స్ కామెరూన్’ తను చేసిన ‘అవతార్’ సినిమా కోసం మొట్టమొదటి సారి ఈ టెక్నాలజీ ని వాడారు. దాంతో అప్పటినుంచి ప్రతి మేకర్ ఆ సెటప్ ను వాడి సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి సైతం ‘వారణాసి’ సినిమా కోసం ఈ మోషన్ క్యాప్చర్ సెటప్ ను వాడుతున్నారు. ఇంతకుముందు బాహుబలి సినిమాలోని కొన్ని ఎపిసోడ్లను షూట్ చేయడానికి ఆయన ఈ సెటపైతే వాడారు… ఈ సెటప్ ని వాడుకోవడానికి విదేశాలకు వెళ్లి అక్కడున్న టెక్నీషియన్స్ తో వర్క్ చేయించుకోవాల్సిన అవసరమైతే ఉంది. దిన్నీ సులభతరం చేయడానికి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సెటప్ ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా దీన్ని ఓపెన్ కూడా చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వచ్చి అతని చేతుల మీదుగా మోషన్ క్యాప్చర్ సెటప్ మొత్తాన్ని ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది…

ఇకమీదట మనవాళ్లు మోషన్ క్యాప్చర్ ను వాడుకోవాలంటే విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లోనే హై టెక్నాలజీ తో దీన్ని వాడుకునే ఫెసిలిటీస్ ను కల్పిస్తున్నారు. రాజమౌళి వారణాసి సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఈ సెటప్ ను వాడబోతున్నట్టుగా చెప్పాడు…

Also Read: ‘విష్ణు విన్యాసం’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు!

దీనివల్ల వర్క్ ఎలా చేస్తారు అంటే సీజీలో ఏదైనా జంతువుని క్రియేట్ చేయాలన్న దాని హావ భావాలను పలికించాల్సి ఉన్న ఈ మోషన్ క్యాప్చర్ సెటప్ తోనే సాధ్యమవుతుంది. ఒక పెద్ద రూమ్ లో ఈ సెటప్ ను సెట్ చేస్తారు. దానికి ఒక సూట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఆ సూట్ వేసుకుని ఒక జంతువుకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తుంటే ఆ రూమ్ మొత్తం కెమెరాలు ఉంటాయి.

వీళ్లిచ్చే ఎక్స్ప్రెషన్స్ ను ఆ కెమెరాలు రికార్డ్ చేసుకుంటాయి. ఆ తర్వాత దానిని సిస్టం సహాయంతో సీజీలోకి మార్చి మొదట ఆ జంతువు యొక్క అస్తిపంజరాన్ని తయారు చేస్తారు. దాని తర్వాత ఆస్తిపంజరం నుంచి జంతువు యొక్క స్కిన్ రెడీ చేసి మొత్తానికైతే అదొక జంతువు లాగా క్రియేట్ చేస్తారు. బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేసే బుల్ ను సైతం ఈ టెక్నాలజీ తోనే క్రియేట్ చేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version