USA on CAA : అమెరికా ద్వంద నీతి CAA అంశంలో మరోసారి వెల్లడయింది

ఇప్పుడు సీఏఏ విషయంలో అమెరికా ద్వంద్వ నీతి పాటిస్తుంది. అమెరికా ద్వంద నీతి CAA అంశంలో మరోసారి వెల్లడయింది .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 16, 2024 4:28 pm

USA on CAA : అమెరికా భారత్ తో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తున్నా.. ఎప్పుడూ ద్వంద్వ నీతిని వదిలిపెట్టడం లేదు. అందుకే ప్రపంచంలో ఎవరూ అమెరికాను నమ్మే పరిస్థితి లేదు. చివరకు యూరప్ దేశాలు కూడా అమెరికాను నమ్మడం లేదు. ఇది నిజం.. ఎందుకు జరుగుతోంది అని చూస్తే..

ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిందని అమెరికా తన మిత్ర దేశాలు అన్నింటిని ఒకే గాటిన కట్టి ఇవాళ ఉక్రెయిన్ కు ఆయుధ సహాయం చేస్తోంది. మరి ఏ కారణం లేకుండా అమెరికా ఇరాక్ మీద దాడి చేశావు. చివరకు అక్కడ ఏ ఆయుధాలు దొరకలేదు. దీనికి జవాబుదారి ఎవరు? నీకు ఒక నీతి? ఇంకొకరికి ఒక నీతినా?

ఉగ్రవాదుల గురించి మాట్లాడుతారు.. పన్ను విషయంలో భారత్ ఏదో చేయబోతోందని ఆరోపణలు.. కెనడా లో ఏదో చేసిందని భారత్ ను విమర్శించే అమెరికా.. వేరే దేశాల్లోని తీవ్రవాదులను వెతికి మరీ ఎలా చంపింది? అప్పుడు వారి దేశాల సార్వభౌమాధికారంపై అమెరికా చేసింది దాడి కాదా? ఎన్నో దేశాలపై బాంబులు వేసి దాడి చేసింది అమెరికా కాదు..

ఇతర దేశాలు అదే పని చేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజాస్వామ్యంపై దాడిగా అమెరికా గగ్గోలు పెడుతుంది. ఉగ్రవాదులు మీకైనా.. మాకైనా ఒకటే కదా..

ఇప్పుడు సీఏఏ విషయంలో అమెరికా ద్వంద్వ నీతి పాటిస్తుంది. అమెరికా ద్వంద నీతి CAA అంశంలో మరోసారి వెల్లడయింది .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.