https://oktelugu.com/

CM Jagan: చెల్లని జీవోలు జారీ చేస్తే ఎలా?

ఐదేళ్ల పాలనా సమయం కరిగిపోయింది. మరి కొద్ది గంటల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఎలా చూశారో అందరికీ తెలిసిందే. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రోజు రాత్రి చెల్లని జీవోలతో రాజకీయం చేయాలని చూస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 16, 2024 1:34 pm
    CM Jagan

    CM Jagan

    Follow us on

    CM Jagan: గత ఐదేళ్లుగా ప్రభుత్వ జీవోలు ఏవీ ఆన్ లైన్ లో కనిపించలేదు. ప్రభుత్వ వెబ్ సైట్ లో సైతం ఎక్కడా దర్శనం ఇవ్వలేదు. సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామని మాత్రం చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్ధ కేటాయింపులు, ఉద్యోగుల జీతాల విషయానికి వచ్చేసరికి మాత్రం బీద అరుపులు అరిచారు. రాష్ట్ర ఆదాయం దృష్ట్యా అర్థం చేసుకోవాలన్న డైలాగ్ కొట్టారు. కానీ తన రాజకీయ సుస్థిరత కోసం ఎన్నిసార్లు బటన్లు నొక్కాలో.. అన్నిసార్లు నొక్కేశారు. అయితే ఇటీవల నొక్కిన బటన్ల కు సంబంధించి నగదు లబ్ధిదారుల ఖాతాల్లో పడడం లేదు. అటు కొత్త కొత్త జీవోలను జారీ చేస్తున్నారు. వాటిని ప్రజాప్రయోజన పథకాలు, కార్యక్రమాలు గా చూపించి ఓట్లు దండుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇది తెలియని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా?..

    ఐదేళ్ల పాలనా సమయం కరిగిపోయింది. మరి కొద్ది గంటల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఎలా చూశారో అందరికీ తెలిసిందే. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రోజు రాత్రి చెల్లని జీవోలతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిన్నటి నుంచి అయితే ప్రతి గంటకు జీవోలు విడుదలవుతూనే ఉన్నాయి. గతంలో జీవోలను మాయం చేసినా.. రహస్యంగా ఉంచినా.. ఇప్పుడు మాత్రం అడిగిన వారికి.. అడగనివారికి జీవోలను పంపుతున్నారు. ప్రభుత్వంలో వచ్చిన ఈ మార్పును చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు.

    ఏపీ ఉద్యోగులకు రెండు డిఏలు ఇస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు ఆ డిఏలను అమలు చేయలేరు. అమలు చేయాల్సింది కొత్త ప్రభుత్వమే. ఇంతలో మీకు డిఏలు ఇచ్చాము.. ఓట్లు వేయండని అడిగేందుకు ఎత్తుగడే. ఎలాగూ అధికారంలోకి వస్తే అది అమలు చేయరు. ప్రత్యర్ధులు వస్తే అమలు చేయాలి. ఈ లెక్కనే ఈ జీవోలపై జీవోలు జారీ చేస్తున్నారు. అంగన్వాడి కార్మికులపై ఏ స్థాయిలో ప్రతాపం చూపారో అందరికీ తెలిసిన విషయమే. వారి డిమాండ్లను పరిష్కరించకుండాఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చాక ఆ సబ్ కమిటీ లో ఉన్న మంత్రులు ఆచేతనంగా మారనున్నారు. ఆ కమిటీ కూడా చెల్లని కాసుగా మారుతుంది. మున్సిపల్ కార్మికుల సమ్మె చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. కేసులు పెట్టారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎత్తివేస్తున్నారు. ఇంతకంటే ఎత్తుగడలు ఉంటాయా? ఇప్పుడు జారీ చేస్తున్న జీవోలకు విశ్వసనీయత ఉంటుందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి.