https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి మెగాస్టార్ అవ్వడంలో అల్లు రామలింగయ్య పాత్ర ఏంటి..?

చిరంజీవి ప్రస్తుతం తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : March 16, 2024 / 01:49 PM IST

    Chiranjeevi and Allu Ramalingaiah

    Follow us on

    Chiranjeevi: ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిరంజీవి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఒక్క అవకాశం రావడానికి కొన్ని నెలల పాటు ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. అయిన కూడా ఒక చిన్న అవకాశం వస్తే దాని ద్వారా ఆయనకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని తెలిసిన కూడా ఓపిగ్గా ఆ చిన్న పాత్ర ల్లో కూడా నటించి మెప్పించే వాడు. అలా చిన్న చిన్న అవకాశాలను దక్కించుకొని తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఆయన స్టార్ హీరోగా ఎదిగిన తీరు చూస్తే ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వకుండా ఉండలేరు. అలాంటి చిరంజీవి ప్రస్తుతం తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

    అయితే మెగాస్టార్ చిరంజీవికి అవకాశాలు రావడానికి మొదట్లో అల్లు రామలింగయ్య కూడా చాలావరకు ప్రయత్నం చేశారట. సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత స్టార్ డైరెక్టర్లతో చిరంజీవికి కాంబినేషన్స్ సెట్ చేశాడట…ఇక దాంతో వరుసగా చిరంజీవి సూపర్ హిట్లను అందుకొని మెగాస్టార్ గా ఎదిగాడు. అయితే అల్లు రామలింగయ్య స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పుడు వాళ్ళతో చిరంజీవి ని పెట్టి ఒక సినిమా చేయండి అని చెప్పేవారట.

    అలా కొంతమందిని చిరంజీవి తో సినిమాలు చేసే విధంగా అల్లు రామలింగయ్య రికమండ్ చేశారని చెబుతూ ఉంటారు. అందుకే చిరంజీవి కి అల్లు రామలింగయ్య అంటే మొదటి నుంచి కూడా చాలా ఇష్టం ఉండేదట. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ఇప్పుడు కూడా ఎవ్వరికీ తగ్గకుండా స్టార్ హీరోలందరికీ పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల కంటే తను తక్కువేమీ కాదు అని తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు.

    ఈ మాత్రం డెడికేషన్ లేకపోతే ఆయన మెగాస్టార్ ఎందుకు అవుతాడు అని మరి కొంతమంది కూడా వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే చిరంజీవి ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టార్ గానే కొనసాగుతూ ఉంటాడు అనేది మాత్రం వాస్తవం…