World Cup 2023- Director Meher Ramesh: ఆరుపదుల వయసు దాటుతున్న సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న స్టార్ చిరంజీవి. ఈ సంవత్సరం వాల్తేర్ వీరయ్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన చిరంజీవి అదే జోరుతో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే జోరులో తాజాగా చిరు, డిజాస్టర్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మొన్న శుక్రవారం ఎంతో హడావిడిగా విడుదలైన ఈ చిత్రం ఒక్క షో పూర్తయ్యేసరికే డిజాస్టర్ బ్రాండ్ ముద్రించుకుంది.
రిలీజ్ అయిన రోజు తప్ప మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. తమిళ్ లో విడుదలైన వేదాళం చిత్రం కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు పూర్తయ్యేసరికి డిజాస్టర్ గా మిగిలింది. భోళా శంకర అట్టర్ ఫ్లాప్ అయితే అయింది కానీ…ఈ కాన్సెప్ట్ తమకు బాగా అచ్చి వస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అయితే దీని వెనక క్రెడిట్ మొత్తం మెహర్ రమేష్ కి వెళ్తుందట.
వివరాల్లోకి వెళ్తే మెహర్ రమేష్ తీసిన సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్లో కప్పు రావడమే దీనికి కారణం అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ మూవీ అయిన శక్తి 2011లో విడుదల అయింది. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించిన ధీరుడు మెహర్ రమేష్ కావడం విశేషం. ఆ మూవీ అలా ఫ్లాప్ అయ్యిందో లేదో అదే సంవత్సరం ధోని నేతృత్వంలో ఐసిఐసి వరల్డ్ కప్ టోర్నమెంట్ను ఇండియా కైవసం చేసుకుంది.
2013లో విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన షాడో చిత్రం రాడ్ మూవీ గా గుర్తింపు పొందింది. అదే సంవత్సరం ధోనీ నేతృత్వంలో ఐసిఐసి ఛాంపియన్ ట్రోఫీను ఇండియా తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా రెండుసార్లు మెహర్ రమేష్ డిజాస్టర్ సెంటిమెంట్ ఇండియన్ టీంకు బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు. డిజాస్టర్ డిప్లమా కంటిన్యూ చేసినప్పటికీ.. అతని చిత్రాలకు మరియు ఇండియన్ క్రికెట్ మ్యాచ్లకు పొంతన కుదరకపోవడంతో పెద్ద ప్రభావం కనబడలేదు.
అయితే సుమారు పది సంవత్సరాల తరువాత ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగబోతుంది అనగా ఆగస్టులో మెహర్ రమేష్ భోళాశంకర్ రూపంలో మరో కొత్త డిజాస్టర్ తో ప్రజల ముందుకు వచ్చాడు. దీంతో ఈసారి వరల్డ్ కప్ కొట్టే అవకాశాలు ఇండియాకి ఎక్కువగా ఉన్నాయని.. అన్ని మంచి శకునాలే అని…మెహర్ రమేష్ డిజాస్టర్ మానియా ఇండియా క్రికెట్ టీం కి బాగా వర్క్ అవుట్ అవుతుందని సోషల్ మీడియాలో ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో ముచ్చటగా మూడోసారి కూడా అవ్వకపోతుందా.. అని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Web Title: Tollywood film director meher ramesh has hinted that team india will win the icc world cup 2023
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com