India Vs New Zealand Semi Final: ముంబైలో హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దర్జాగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. గురువారం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల క్రికెట్ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఈ పోరులో భారత జట్టునే విజయం వరించింది. సాధారణంగా క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే మన దేశంలో.. మన జట్టు గెలిస్తే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. అభిమానుల ఆనందం హద్దులు దాటుతుంది. అయితే చాలామంది తమ జట్టు సాధించిన విజయాన్ని రకరకాలుగా జరుపుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాం కనుక.. రకరకాల మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
లింక్ పెట్టేశారు
మనదేశంలో సినిమాల ప్రభావం చాలా ఎక్కువ. సినిమా సన్నివేశాలను వాస్తవిక జీవితాన్ని జోడించి మీమ్స్ రూపొందించడం ఇటీవల పెరిగిపోయింది.. పైగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది తారాస్థాయికి చేరింది. రీల్స్ అని ఇంకోటని దానికి పేరు పెట్టారు గాని.. అసలు ఉద్దేశం మాత్రం ప్రజాధరణ పొందటమే. బుధవారం సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ పై విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియా లో రకరకాల మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అందులో ఒక వీడియో మీమ్ మాత్రం తెగ ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా దానిని జులాయి సినిమాకు అన్వయించడం మరింత బాగుంది.
నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ..
2019లో సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత్ ఓడిపోయింది. అప్పట్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు. ఈ ఓటమితో భారత జట్టు ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఈ క్రమంలో బుధవారం భారత జట్టును సాధించిన విజయాన్ని.. అప్పట్లో ఎదురైన పరాభవాన్ని మిళితం చేసి ఒక వీడియో రూపొందించారు. అందులో తెలివిగా జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు తనికెళ్ల భరణి హితబోధ చేస్తున్న మాటలను జోడించారు. అల్లు అర్జున్ స్థానంలో రోహిత్ శర్మ రన్ అవుట్ అయిన వీడియోను పొందుపరిచి ఎలాగైనా గెలవాలి అనే కసిని తనికెళ్ల భరణి చెబుతున్నట్టుగా మార్చారు. ఓటమే గెలుపుకు నాంది అనే విధంగా ఈ వీడియోను రూపొందించారు. ఇప్పటికే ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ సాధించింది. కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియా సాధించిన విజయాన్ని ఇలా రూపొందించిన విధానాన్ని అభినందిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you know the link to indias semis victory july movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com